AP CM Ys Jagan : ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప జిల్లాపర్యటన ఖరారైంది. ఈనెల 8,9 తేదీల్లో బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

AP CM Ys Jagan : ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు

AP CM Ys Jagan Kadapa Tour

AP CM Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప జిల్లాపర్యటన ఖరారైంది. ఈనెల 8,9 తేదీల్లో బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. రెండురోజుల పర్యటనలో ముఖ్యమంత్రి పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన గురించి జిల్లా కలెక్టర్ హరినారాయణ అందించిన వివరాల ప్రకారం..

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీన ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
8.50 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 9.55 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
10.40 నుంచి అనంతపురం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని హెలికాప్టర్‌ ద్వారా మధ్యాహ్నం 1.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడినుంచి బయలుదేరి 1.50 గంటలకు తన నివాసానికి చేరుకుని 2.00 గంటల వరకు అక్కడే ఉంటారు.

మధ్యాహ్నం గం.2.15 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి పులివెందులలోని ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
2.25 గంటల నుంచి 3.00 గంటల వరకు అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
3.05 గంటలకు స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌నుంచి పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
3.15 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
3.35 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు.
3.40 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని
4.00 నుంచి 4.45 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
4.50 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

జులై 9వ తేదీ ఉదయం 10.00 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి 10.10 గంటలకు అక్కడే ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
10.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.40 గంటలకు బద్వేలులోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
11.05 గంటలకు బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు.
11.10 నుంచి 12.45 గంటల వరకు బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు బహిరంగసభలో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి 1.15 గంటలకు బయలుదేరి 1.20 గంటలకు కడప రిమ్స్‌ వద్దగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అక్కడినుంచి బయలుదేరి 2.05 గంటలకు సీపీబ్రౌన్‌ గ్రంథాలయం చేరుకుని సీపీ బ్రౌన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.

2.25 గంటలకు అక్కడి నుండి బయలుదేరి కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న మహావీర్‌ సర్కిల్‌కు చేరుకుని కడపకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.45 గంటలకు వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియానికి చేరుకుంటారు.
3.50 నుంచి 4.20 గంటల వరకు స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు.
4.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రిమ్స్‌ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
4.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
5.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.