YS Jagan review : లాక్ డౌన్, కర్ఫ్యూ పై సీఎం జగన్ అధికారులతో సమీక్ష

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్‌ సోమవారం అధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో  కర్ఫ్యూ విధించాలా...లాక్ డౌన్ విధించాలా, లేదంటే కఠిన ఆంక్షలు అమలు చేసే అంశంపై ఆయన అధికారులతో సమీక్షిస్తారు. 

YS Jagan review : లాక్ డౌన్, కర్ఫ్యూ పై సీఎం జగన్ అధికారులతో సమీక్ష

Ap Cm Ys Jagan Review On Lock Down

AP CM YS Jagan will hold a Covid-19 review meeting today : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో… ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్‌ సోమవారం అధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో  కర్ఫ్యూ విధించాలా…లాక్ డౌన్ విధించాలా లేదంటే కఠిన ఆంక్షలు అమలు చేసే అంశంపై ఆయన అధికారులతో సమీక్షిస్తారు.

కరోనా వైరస్‌ విజృంభణను అదుపు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంపై చర్చించే అవకాశముంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ నిర్వహణ అంశాలను పరిశీలించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ఇప్పటికే కమిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం.

కరోనా కట్టడి కోసం ఎటువంటి ఆంక్షలు పెట్టాలనే దానిపై సీఎం జగన్.. అధికారులతో చర్చించే అవకాశముంది. ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించినా, కరోనా ఉద్ధృతితో సర్కారు పునరాలోచనలో పడింది. దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

తల్లిదండ్రుల నుండి వస్తున్న సూచన ప్రకారం ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన  సిబ్బంది విద్యార్ధులు  వైరస్ బారినపడ్డారు.  ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఘటనపై  సీఎం జగన్ అధికారులతో సమీక్ష చేయనున్నారు.

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలా?, లేక వాయిదా వేయాలా? అనే అంశంపై అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో వ్యాపార సంస్థలు మూసివేశారు. వ్యాపార వేళల్లో కూడా మార్పులు చేశారు.

విద్యాసంస్థల్లోనూ కరోనా కేసులు వస్తుండడంతో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, స్కూళ్లకు సెలవులు ప్రకటించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు పబ్లిక్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.