Congress: పొలిటికల్‌గా కాంగ్రెస్‌లోనే చిరంజీవి.. ఏపీసీసీ ప్రకటన

పొలిటికల్‌గా మరోసారి చిరంజీవి ప్రస్తావన వస్తుంది.. తెలంగాణ రాజీకీయాల్లో కాంగ్రెస్ నాయకత్వం మార్పువేళ.. చిరంజీవి కాంగ్రెస్‌లో లేరు అంటూ కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్‌ చాందీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Congress: పొలిటికల్‌గా కాంగ్రెస్‌లోనే చిరంజీవి.. ఏపీసీసీ ప్రకటన

Congress

Chiranjeevi: పొలిటికల్‌గా మరోసారి చిరంజీవి ప్రస్తావన వస్తుంది.. తెలంగాణ రాజీకీయాల్లో కాంగ్రెస్ నాయకత్వం మార్పువేళ.. చిరంజీవి కాంగ్రెస్‌లో లేరు అంటూ కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఉమెన్‌ చాందీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి కాంగ్రెస్ వాదేనంటూ ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేసింది. ఉమెన్ చాందీ చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అనడంపై ఎపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ఓ ప్రకటన చేశారు.

మాజీ కేంద్ర మంత్రి, సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ వాదేనని, తనకిష్టమైన సినీరంగంలో బిజీగా ఉండడం వల్ల పార్టీ కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొనట్లేదని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీకార్మికులకు, పేదలకు సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజలతో చిరంజీవి మమేకం అవుతున్నారని అన్నారు. చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులని, చిరంజీవి కాంగ్రెస్ వాది కాదంటూ వస్తున్న వార్తలు కరెక్ట్ కాదన్నారు.

భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందజేస్తారని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చిరంజీవి క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందన్నారు. అంతకుముందు ఓ ప్రకటనలో ఉమెన్‌ చాందీ మాట్లాడుతూ.. చిరంజీవి కాంగ్రెస్‌లో లేరని అన్నారు. వాస్తవానికి చిరంజీవి స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీకాలం పూర్తయ్యాక చిరంజీవి సినిమాల్లోనే బిజీగా ఉన్నారు. రాజకీయంగా ఎటువంటి వ్యాఖ్యలు, కార్యక్రమాల్లో లేరు.