AP Corona : ఏపీలో కొత్తగా 181 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31వేల 957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. గుంటూరు, కృష్ణా..

AP Corona : ఏపీలో కొత్తగా 181 కరోనా కేసులు

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31వేల 957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

గడిచిన 24 గంట్లలో 176 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,74,217కి పెరిగింది. ఇప్పటి వరకు 20,57,749 మంది కోలుకున్నారు. కోవిడ్ మృతుల సంఖ్య 14,457కి పెరిగింది.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 32, గుంటూరు జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవ లేదు.

Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

Bipin Rawat : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఇవేనా..!

దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పటకే 57 దేశాలను చుట్టేసింది. భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోక ముందే.. ఇక, థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదన్న హెచ్చరికలు కలవర పెడ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. కరోనా నిబంధనలు పాటించాల్సిందే. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. అలాగే అర్హులందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి.