AP Corona : ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,174 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో తొమ్మిద

AP Corona : ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

Andhra pradesh

AP Corona : ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,174 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో తొమ్మిది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 20,08,639 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారితో 14,061 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,653 యాక్టివ్‌ కేసులున్నాయి.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 208, ప్రకాశంలో 161, చిత్తూరులో 159, కృష్ణాలో 140, గుంటూరులో 131, నెల్లూరులో 122 కేసులు రికార్డయ్యాయి. గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడప, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 55వేల 525 పరీక్షలు నిర్వహించారు.

Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు:
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ఆంక్షలను ఈ నెల 30 వరకు కొనసాగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయంది. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంక్షల్ని ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.