Home » Andhrapradesh » ఏపీలో కొత్తగా 510 కరోనా కేసులు, ముగ్గురు మృతి
Publish Date - 6:11 pm, Sat, 12 December 20
By
sreehariAP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 67,495 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 510 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,75,025లకు చేరాయి.
రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి ముగ్గురు మరణించారు. 665 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా పరీక్షలను 1,07,67,117 పరీక్షించినట్టు ఏపీ ప్రభుత్వం బులెటిన్ లో వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తంగా 8,62,895 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,052కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల గుంటూరు, వైస్ఆర్ కడప, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Covid Deaths : స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్.. మృతదేహాలతో బారులు తీరిన వాహనాలు.. బెంగళూరులో భయానకం
AP Corna : ఏపీలో కరోనా ఉగ్రరూపం, భారీగా పెరిగిన కొత్త కేసులు, మరణాలు.. ఆ ఒక్క జిల్లాలోనే వెయ్యికిపైగా బాధితులు
AP Corona Cases : ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 4వేలకు పైగా కేసులు, 18మరణాలు
AP Corona : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే దాదాపు 2వేల కొత్త కేసులు
Coronavirus Alert : కరోనాపై అలర్ట్.. భారత్‌ను భయపెడుతున్న వైరస్
Ap Covid 19 Cases : ఏపీలో డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 500కి చేరువలో కరోనా కొత్త కేసులు, ఆ ఒక్క జిల్లాల్లోనే 100కుపైగా బాధితులు