Covid-19 rules : దేవినేని ఉమపై కోవిడ్ కేసు

మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు కరోనా కేసు నమోదుచేశారు. ఉమ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Covid-19 rules : దేవినేని ఉమపై కోవిడ్ కేసు

Covid rules Break case on Devineni uma : మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు కరోనా కేసు నమోదుచేశారు. ఉమ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 16న మైలవరంలోని అయ్యప్ప నగర్‌లో ప్రభుత్వ ఇళ్ల స్థలాలను దేవినేని ఉమ పరిశీలించిన సందర్భంగా ఆయన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఉమా ప్రభుత్వ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఆయన వెంట నిబంధనలకు మించి జనాలు తీసుకొచ్చారని అందుకే కోవిడ్ నిబంధలు ఉల్లంఘించిన అభియోగంతో బుధవారం (జూన్ 16,2021) కేసు నమోదు చేసారు.

కాగా..ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు రాజకీయ కక్షతో దేవినేని ఉమపై కోవిడ్ నిబంధనల పేరుతో కేసు నమోదు చేశారని ఆయన వర్గీయులు విమర్శిస్తుననారు. పోలీసులు కావాలనే కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతున్నారని మైలవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

Read:Cat fish : అక్రమంగా క్యాట్ ఫిష్ ల పెంపకం..దాణాగా కోళ్ల వ్యర్థాలు.. బయటపెట్టిన 10టీవీ