AP Covid-19 Updates : ఏపీ కరోనా కథ మారింది.. రికవరీ కేసులే ఎక్కువ!

  • Published By: sreehari ,Published On : September 21, 2020 / 05:52 PM IST
AP Covid-19 Updates : ఏపీ కరోనా కథ మారింది.. రికవరీ కేసులే ఎక్కువ!

AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కథ మారింది.. మహమ్మారి క్రమంగా కనుమరుగైపోతోంది.. రోజురోజుకీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది.. కరోనా నుంచి కోలుకునే రికవరీ కేసులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి.



గత 24 గంటల్లో 56,569 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 6,235 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో 51 మంది మృతిచెందారు. ఏపీలో 6,31, 749కి కరోనా కేసులు చేరాయి. వీరిలో 5,410 మంది మృతిచెందారు. ఏపీలో 74,518 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,51,821 మంది డిశ్చార్జ్ అయ్యారు.



ఏపీలో కరోనా సోకి మృతిచెందిన వారిలో కృష్ణ జిల్లాలో 9మంది, చిత్తూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, కడపలో ఇద్దరు మృతిచెందారు.



ప్రకాశంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 10,502 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 51 లక్షల 60 వేల 700 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.