AP Covid Updates: ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువ!

ఏపీలో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 పాజటివ్ కేసులు నమోదయ్యాయి.

AP Covid Updates: ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఆ మూడు జిల్లాల్లోనే ఎక్కువ!

Ap Covid Updates

AP Covid-19 Updates : ఏపీలో కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,421 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా బారిన పడి కొత్తగా 81 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11,2132కు చేరింది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 86,223 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

అదేవిధంగా 16,223 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 15 లక్షల 78 వేల 452 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 1,95,34,279 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుతుండగా.. మూడు జిల్లాల్లో మాత్రం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోనే కేసుల సంఖ్య పెరుగుతోంది. అనంతపురంలో 1041, చిత్తూరు 1628, తూర్పు గోదావరి 2308 కేసులు నమోదు కాగా.. కృష్ణా 841, కర్నూలు 556, నెల్లూరు 546, ప్రకాశం 607, గుంటూరు 669, కడప 602, విజయనగరం 318, పశ్చిమ గోదావరి జిల్లాలో 996, శ్రీకాకుళం 465, విశాఖపట్నం 814 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనాతో కొత్తగా చిత్తూరు జిల్లాలో 13 మంది, అనంతపురం 9, శ్రీకాకుళం 9, విశాఖ 6, కృష్ణ 5, కర్నూలు 5, విజయనగరం 7, తూర్పు గోదావరి 6, గుంటూరు 4, ప్రకాశం 4, కడప జిల్లాలో ఇద్దరు, నెల్లూరు 6, పశ్చిమ గోదావరి ఐదుగురు చనిపోయారు.