AP Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ముందు వరుసలో ఏపీ

కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ సగటు కంటే ముందువరుసలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన టీకా డోసులతో పోలిస్తే ఏపీకి తక్కువ డోసులు కేటాయించారు.

AP Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ముందు వరుసలో ఏపీ

Ap Covid Vaccination

AP Covid Vaccination : కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ సగటు కంటే ముందువరుసలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన టీకా డోసులతో పోలిస్తే ఏపీకి తక్కువ డోసులు కేటాయించారు.  ఈ కింది గణాంకాల్లో దేశంలో వ్యాక్సినేషన్, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించొచ్చు.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు టీకాల సంఖ్య 21,69,00,642గా నమోదైంది. మొత్తం జనాభాతో పోలిస్తే టీకాలు తీసుకున్నవారు 3.2శాతంగా నమోదైంది.

ఏపీలో ఇప్పటి వరకు వేసిన టీకాలు 1,02,45,680 కాగా.. 4.72 శాతం నమోదైంది. దేశవ్యాప్తంగా మొదటి డోసు టీకాలు తీసుకున్నవారు 17,29,85,046 మంది ఉంటే.. ఏపీలో మొదటి డోసు తీసుకున్నవారు మాత్రం 76,97,73గా ఉన్నారు. దేశం మొత్తం మొదటి డోసు టీకా తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే.. ఏపీలో మొదటి డోసు టీకా తీసుకున్నవారి శాతం 4.45గా ఉంది. దేశ వ్యాప్తంగా రెండో డోసు తీసుకున్నవారు 4,39,15,596 ఉంటే.. ఏపీలో రెండో డోసు టీకా తీసుకున్నవారు 25,47,942 మంది ఉన్నారు.

దేశం మొత్తం రెండో డోసు టీకా తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఏపీలో రెండో డోసు టీకా తీసుకున్నవారి శాతం 5.80గా నమోదైంది. భారతదేశం మొత్తం జనాభా 136.64 కోట్లు కాగా.. కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 17,29,85,046
ఉండగా.. మొత్తంగా 12.68శాతంగా ఉందని గణాంకాలు వెల్లడించాయి.

ఏపీ జనాభా 5.2 కోట్లు ఉండగా.. ఏపీలో కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 76,97,738 ఉండగా 14.80శాతంగా నమోదైంది. భారతదేశ 136.64 కోట్ల జనాభాలో రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 4,39,15,596 గా ఉంటే.. అంటే 3.2శాతంగా నమోదైంది.. ఏపీ జనాభా 5.2 కోట్ల మందిలో రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 25,47,942 తో 4.9శాతంగా ఉంది.