GO NO 1 : జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు : సీపీఐ రామకృష్ణ

జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కోర్టులు ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మొట్టికాయలు వేసినా..తీవ్రంగా చీవాట్లు పెట్టినా జగన్ ప్రభుత్వం తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావటంలేదన్నారు.

GO NO 1 : జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు : సీపీఐ రామకృష్ణ

CPI Secretary Ramakrishna expressed happiness over the Supreme Court's verdict on GO NO 1

GO NO 1 in AP : జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కోర్టులు ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో మొట్టికాయలు వేసినా..తీవ్రంగా చీవాట్లు పెట్టినా జగన్ ప్రభుత్వం తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావటంలేదన్నారు. జీవో నంబర్ 1 నిబంధనలు సరిగా లేవని రోడ్లపై సభలు, రోడ్‌షోలను నియంత్రించడం, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం మధ్య ప్రభుత్వం సమతుల్యతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేసిన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవో నంబర్ 1పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మరోసారి ఏపీ ప్రభుత్వానికి ఝలక్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోం అంటూ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ కేసును తిరిగి ఏపీ హైకోర్టే విచారించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని ఆదేశించింది.

Supreme Court : ‘AP హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోం’..జీవో నెంబర్ 1 కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశం

కాగా.. ఏపీలో విపక్ష పార్టీల్లో సెగలు రేపుతున్న జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ.. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ జనవరి 12న ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోనెంబర్ 1 పోలీస్ యాక్ట్ 30కి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈకేసు విచారణ తిరిగి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిసే విచారించాలని స్పష్టంచేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ప్రకాశం జిల్లా కందుకూరులోను..గుంటూరులోను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఈ తొక్కిసలాటల్లో మొత్తం 11మంది చనిపోయారు. కందుకూరులో సభలో ఎనిమిది మంది, గుంటూరులో తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. దీంతో రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జనవరి (2023) 2న జీవో నెంబర్ 1ని జారీ చేసింది. ఈ జీవోపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించాయి. విపక్షాలను టార్గెట్ చేయటానికే బ్రిటీష్ కాలంనాటి జీవో తీసుకొచ్చారంటూ వివర్శించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజల క్షేమం కోసమే ఈ జీవో అంటూ సమర్థించుకుంది.

AP High court : జీవో నెంబర్ 1పై సస్పెన్షన్ విధించిన హైకోర్టు .. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

ఈ జీవో నెంబర్ 1ని ఆధారంతో చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. పోలీసుల తీరును చంద్రబాబు తప్పుబట్టి రోడ్డుమీదనే బైఠాయించి ధర్నా చేశారు. అలాగే జీవోను జనసేన కూడా తప్పుపట్టింది. ఎన్నికల వాహనంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఓ బస్సును సిద్ధం చేసుకున్నారు. దానికి వారాహి అని పేరు పెట్టారు. ఈ బస్సుపై పవన్ యాత్ర చేస్తే అడ్డుకుంటామని వైసీపీ నేతలు ప్రకటించారు.