ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు

మున్సిపల్ ఎన్నికల్లో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు అయింది. ఏలూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ కు వెళ్లిన ఆళ్ల నానికి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు.

ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు

Alla Nani lost the vote : మున్సిపల్ ఎన్నికల్లో సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఓటు గల్లంతు అయింది. ఏలూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ కు వెళ్లిన ఆళ్లనానికి అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏలూరు శనివారపుపేట ఇందిరాకాలనీలో తనకు ఓటు ఉండటంలో అదే కాలనీ స్కూల్లో ఆళ్ల నాని ఓటు వేసేందుకు వెళ్లారు. తన ఓటు గల్లంతు కావడంతో ఆయన అసహనానికి గురయ్యారు. డిప్యూటీ సీఎం ఓటే గల్లంతు కావడంతో అధికారులపై తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

వాస్తవానికి ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో హైకోర్టు సింగిల్ బెంచ్ ఏలూరులో ఎన్నికలను వాయిదా వేసింది. అయితే డివిజన్ బెంచ్ ఈ తీర్పును రద్దు చేసి పోలింగ్ కు అనుమతిచ్చింది. ఏలూరులో ఓటర్ లిస్టులో అవకతవకలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చు గానీ ఫలితాలు వెల్లడించొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.