Vaccination : ఒక్కో డోసుకు రూ. 600 వసూలు..కారులో డాక్టర్ కరోనా టీకాల దందా..

విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం గిరి వీధిలో ఓ డాక్టరు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ..టీకాలు వేయించుకోవటానికి వచ్చినవారికి కారులోనే కూర్చోపెట్టి టీకాలు వేస్తున్నాడు.

Vaccination : ఒక్కో డోసుకు రూ. 600 వసూలు..కారులో డాక్టర్ కరోనా టీకాల దందా..

Covid 19 Vaccines

covid-19 vaccines  : కరోనా కష్టంతో జనాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతూ..వ్యాక్సిన్ కోసం హెల్త్ సెంటర్ల దగ్గర పడిగాపులు పడుతుండే ఓ డాక్టర్ మాత్రం కరోనా కష్టాలకు కాసులుగా మార్చుకోవాలనుకున్నాడు. ఎంతోమంది డాక్టర్లు తమ ప్రాణాలను అడ్డుపెట్టి కరోనా బాధితులకు రాత్రీ పగలు సేవలు చేస్తుంటే..ఏపీలో ఓ డాక్టర్ మాత్రం కరోనా టీకాల కొరతను అడ్డగోలుగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కో డోసుకు రూ.600లు వసూలు చేస్తూ కాసుల కక్కుర్తికి పాల్పడి..పట్టుబడ్డాడు. సెంటర్ల దగ్గర పడిగాపులు పడి లైన్ లో నిలబడి టీకా వేయించుకోవటమెందుకు? హాయిగా దర్జాగా డబ్బులు ఎక్కువైనా ఇచ్చేసి టీకా వేయించుకుందామనుకునేవారు ఇటువంటి స్వార్థపరులు కాసుల వర్షం కురిపిస్తున్నారు.

విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం గిరి వీధిలో ఓ డాక్టరు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ..టీకాలు వేయించుకోవటానికి వచ్చినవారికి కారులోనే కూర్చోపెట్టి టీకాలు వేస్తున్నాడు. ఈ విషయం స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తికి సమాచారం అందటంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. దీంతో సదరు డాక్టర్ వారి నుంచి తప్పించుకుని అక్కడ నుంచి కారుతో సహా అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో వెంటనే అప్రమత్తమైన కార్పొరేటర్ బైక్‌పై డాక్టర్ కారును వెంబడించారు. అలా వెంబడించీ వెంబడించగా..రామవరప్పాడు రింగ్ సెంటర్‌లో కారును ఆపి ఎలాగైతేనే ఆ డాక్టర్ ను పట్టుకున్నారు. అదేసమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులకు ఈ విషయం చెప్పగా. వారు కారును తనిఖీ చేయగా..కారులో టీకా వేయించుకున్న ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. కారులో కొన్ని సూదులు, ఇంజక్షన్లు లభ్యం కావటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కారులో ఉన్న వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో సదరు వ్యక్తులు భీమవరానికి చెందినవారిగా తెలిసింది.

జి. కొండూరులో పనిచేసే ఓ డాక్టర్ తమతోపాటు మరికొందరికి టీకాలు వేసినట్టు వారు పోలీసులు వెల్లడించారు. కారులో సూదులు, ఇంజెక్షన్లు తప్ప వ్యాక్సిన్లు కనిపించకపోవడం…దీనిపై ఎటువంటి కంప్లైంట్ రాకపోవటంతో పోలీసులు వారి ముగ్గురితో పాటు ఆ డాక్టర్ ను కూడా వదిలిపెట్టేయటం గమనించాల్సిన విషయం. అక్రమంగా ఇటువంటి పనులు చేస్తున్న డాక్టర్ ను పోలీసులకు అప్పగించటానికి సదరు కార్పొరేటర్ పడిన కష్టం అంతా ఎందుకు పనికిరాకుండా పోవటం మరో విషయం.