AP EAMCET Exam Schedule : ఏపీ ఎంసెట్ పరీక్షల తేదీలు… జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో ఎంసెట్ ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం (జూన్ 19)న ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు.

AP EAMCET Exam Schedule : ఏపీ ఎంసెట్ పరీక్షల తేదీలు… జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ

Ap Eamcet Exam Schedule Dates Announced By State Govt

AP EAMCET Exam Schedule : ఏపీలో ఎంసెట్ ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం (జూన్ 19)న ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు.

ఈ నెల 24 ఎంసెట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 26 నుంచి జూలై 25 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

జూలై 26 నుంచి ఆగష్టు 5 వరకు రూ. 500 ఫైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 1000 లేట్ ఫీజుతో ఆగ‌ష్టు 6 నుంచి ఆగష్టు 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ. 5000 లేట్ ఫీజుతో ఆగ‌స్టు 11 నుంచి ఆగష్టు 15 వరకు రూ. 10 వేలు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆగ‌స్టు 16 నుంచి ఆగష్టు 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.

ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని అన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి ఎంసెట్ పరీక్షలను గతంలో కంటే ఎక్కువ సెంటర్లలోనే పరీక్షలను నిర్వహించనున్నట్టు మంత్రి ఆదిమూలపు వెల్లడించారు.