AP PRC : మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం

మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ.

AP PRC : మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం

Ap Prc Talks

AP PRC : మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు ఉంచిన మూడు డిమాండ్లు తీర్చలేమని తేల్చేసింది మంత్రుల కమిటీ. ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెనక్కి తీసుకోవడం కుదరదని చెప్పింది. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ నెల 3న తలపెట్టిన చలో విజయవాడ యథాతథంగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. చలో విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

Union Budget 2022: బడ్జెట్ తర్వాత బూట్లు, బట్టల ధరలు తగ్గాయి.. ఏవి పెరిగాయో తెలుసా?

పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టిస్తోందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు జరిగిన చర్చల్లో మూడే అంశాలు చెప్పామని, మంత్రుల కమిటీ కొంత సమయం తర్వాత అభిప్రాయం చెప్తామని తమను మభ్యపెట్టిందని… సాయంత్రానికి తమ డిమాండ్లు సాధ్యపడవు అని ఒక సందేశంలో రూపంలో పంపిందని బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులను భయపెట్టొద్దని, ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను మానుకోవాలని కలెక్టర్లకు బండి శ్రీనివాసరావు సూచించారు.

Sleeping : బోర్లా పడుకుని నిద్రించే అలవాటుందా?..అయితే జాగ్రత్త?

చర్చల్లో పురోగతి రావాలంటే పాత జీతం ఇమ్మని ప్రభుత్వాన్ని అడిగామని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. నిర్బంధపు వేతన సవరణను ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ అమలు చేయడానికి మార్చి 2022 వరకు సమయం ఉందని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు జీవోలో పేర్కొన్నారని… అయినా రాత్రికి రాత్రి ఎందుకు జీతాలు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులు విశాల దృక్పథంతో ఉండాలన్నారు. ఈరోజు కొన్ని పే స్లిప్పులు చూపించారని.. అందులో తమకు జీతాలు పెరిగినట్టు చూపించి… లేనిది ఉన్నట్టుగా భ్రమింప చేస్తున్నారని ఆరోపించారు.

”మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్టే. గతంలో చర్చలకు పిలిచి ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్టు పదేపదే చెప్పాము. నేటి సమావేశంలోనూ పాత అంశాలపైనే మాట్లాడారు. మేము చెప్పిన 3 ప్రధాన అంశాలపై తేల్చాలని కోరగా… ఆ మూడు అంశాల పరిష్కారం సాధ్యపడదని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుంది. ఫిబ్రవరి 3న తలపెట్టిన ఛలో విజయవాడ ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలి. ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నాలు చేయవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలి” అని బండి శ్రీనివాసరావు అన్నారు.