పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి -ఉగ్యోగ సంఘాల జేఏసీ

పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి -ఉగ్యోగ సంఘాల జేఏసీ

AP employees unions Joint Working Group Demands Postponement of Panchayat Elections : పంచాయతీ ఎన్నికలకు వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్‌ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునరాలోచన చేయాలని కోరింది. కరోనా కష్టకాలంలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించడాన్ని జేఏసీ తప్పుపట్టింది. ఎన్నికల విధుల నిర్వహణకు ఉద్యోగులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టలేమని జేఏసీ నాయకులు చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై.. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి .. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో… జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.

ఎస్ఈసీ నోటిఫికేషన్‍‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై నేడు పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది హైకోర్టు.