Power Cuts : ఏపీలో కరెంటు కోతలు.. ఊరటనిచ్చే విషయం చెప్పిన ప్రభుత్వం

ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం ఆందోళనలు నెలకొన్నాయి. కరెంటు కోతలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని..

Power Cuts : ఏపీలో కరెంటు కోతలు.. ఊరటనిచ్చే విషయం చెప్పిన ప్రభుత్వం

Power Cuts

Power Cuts : దేశవ్యాప్తంగా ఏర్పడిన బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తప్పదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అంధకారం నెలకొంటుందని, చీకట్లో మగ్గాల్సి వస్తుందని వర్రీ అవుతున్నారు. ఇక ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరెంటు కోతలు అమలవుతున్నాయి. ఏపీలోనూ విద్యుత్ సంక్షోభం ఆందోళనలు నెలకొన్నాయి. కరెంటు కోతలు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రంలో కరెంటు కోతలపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు.

Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత

ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. యూనిట్ రూ.20కు కొని విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా, బొగ్గు కొతర వల్లే విద్యుత్ సమస్య ఏర్పడిందని, అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ సమస్య ఉందని మంత్రి అన్నారు. ఎంత ఖర్చయినా బహిరంగ మార్కెట్ లో విద్యుత​ కొనుగోలు చేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ కోతలపై టీడీపీ కుట్రపూరితంగా దుష్ర్పచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. విద్యుత్‌ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

విద్యుత్ కోతలపై విపక్షాలు బురదజల్లుతున్నాయని మంత్రి బాలినేని మండిపడ్డారు. ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకుని టీడీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన ఆరోపించారు. కోట్ల రూపాయలు తీసుకుని ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారని గత టీడీపీ ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేశారు. తక్కువ ధరకు విద్యుత్ కొందామంటే కోర్టులో కేసులు వేసి ఆపుతున్నారని మంత్రి బాలినేని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించారని ఆయన ధ్వజమెత్తారు. సోలార్ పవర్‌ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుందన్నారు.

కాగా, బొగ్గు సంక్షోభం నేపథ్యంలో ఏపీలోనూ కరెంటు కోతలు తప్పకపోవచ్చని, త్వరలో అధికారిక విద్యుత్ కోతలు విధించాల్సి రావొచ్చని అధికారులు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో విద్యుత్ కోతలపై పుకార్లు మొదలయ్యాయి. దసరా పండుగ తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటల కొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో దీనిపై రాష్ట్ర ఇంధన శాఖ స్పందించాల్సి వచ్చింది. విద్యుత్ కోతలు ఉంటాయనే ప్రచారంలో వాస్తవం లేదంది. అది తప్పుడు ప్రచారం అని, అలాంటి వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు.