AP ESET-2022 Results : ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల..బాలికలదే పైచేయి

ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి బుధవారం(ఆగస్టు10,2022) ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో గత నెల 22న ఏపీ ఈసెట్‌-2022 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.

AP ESET-2022 Results : ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదల..బాలికలదే పైచేయి
ad

AP ESET-2022 Results : ఏపీ ఈసెట్‌-2022 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి బుధవారం(ఆగస్టు10,2022) ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో గత నెల 22న ఏపీ ఈసెట్‌-2022 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.

Employees need know about EPF: ఈపీఎఫ్ గురించి ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు

వీరిలో బాలురు 91.44 శాతం, బాలికలు 95.68 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 14 విభాగాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను 11 సెక్షన్లలోనే నిర్వహించినట్లు హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. కొన్ని కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువగా రావడంతో పరీక్ష నిర్వహించలేదని తెలిపారు. ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx ను సందర్శించి తెలుసుకోవచ్చు.