Fake Police : ‘పోలీస్’ స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలింపు..పైగా రాంగ్ రూట్..

Fake Police : ‘పోలీస్’ స్టిక్కర్ అంటించుకుని మద్యం తరలింపు..పైగా రాంగ్ రూట్..

Face Police

Fake police : చేసేది తప్పుడు పని..పైగా దానికి పోలీసులంటూ బిల్డప్. మరి చేసే తప్పుడు పని అయినా కాస్త జాగ్రత్తగా చేయకపోతే ఇదిగో ఇలాగే అడ్డంగా బుక్ అయిపోక తప్పదని నిరూపించారు కొంతమంది కేటుగాళ్లు. ఓ వాహనానికి ‘పోలిస్’ అని స్టిక్కర్ అంటించుకుని మీర అక్రమంగా మద్యం తరలిస్తూ నిజమైన పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పైగా రాంగ్ రూట్ లో వెళుతూ..మరి ఇన్ని ‘రాంగ్’లతో దొరక్కుండా ఎక్కడికెళతారు. అలా బుక్ అయ్యి..అత్తారింట్లో ఊచలు లెక్కిస్తున్నారు.

ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి..తన వాహనానికి పోలీస్ అనే స్టిక్కర్ అంటించుకుని దర్జాగా మద్యం తరలించేస్తున్నాడు. పోలీస్ స్టిక్కర్ ఉంది కదా? నన్నెవ్వడు ఆపుతాడనే ధీమాతో రాంగ్ రూట్ లో దూసుకెళ్లిపోతున్నాడు. అక్రమ మద్యాన్ని తెచ్చి ధర్మవరంలో గత కొన్ని రోజులుగా గుట్టచప్పుడు కాకుండా అమ్మేస్తున్నాడు పాండు అనే మద్యం వ్యాపారి. కానీ ఎక్స్ ట్రాలు ఎక్కువ కాలం నడవవు అన్నట్లుగా..చివరికి టైం దగ్గర పడి పోలీసులకు దొరికిపోయాడు.

ఇతగాడి ఫేక్ వేషాల గురించి పోలీసులకు సమాచారం అందటంతో కాపు కాచి పాండును పట్టుకున్నారు పోలీసులు. సెబ్ సిఐ శ్రీరాం ఆధ్వర్యంలోని పోలీసుల బృందం..పాండును అరెస్టు చేసి.. 3 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ధర్మవరం పోలీసులు. అలా ఫేక్ పోలీసు గుట్టు రట్టు అయ్యింది.