School and Intermediate fee: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఫీజులపై భారీ నియంత్రణ

స్కూల్స్, కాలేజీల ఫీజులను ఫిక్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ రెగ్యూలేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. 2021-22 విద్యా సంవత్సరం నుంచి మొదలయ్యే కోర్సులకు ఈ ఫీజులు వర్తించను

School and Intermediate fee: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఫీజులపై భారీ నియంత్రణ

Ap Education

School and Intermediate fee: స్కూల్స్, కాలేజీల ఫీజులను ఫిక్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ రెగ్యూలేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. 2021-22 విద్యా సంవత్సరం నుంచి మొదలయ్యే కోర్సులకు ఈ ఫీజులు వర్తించనున్నాయి.

కమిషన్ ఛైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) ఆర్ కాంతారావు గురువారం ప్రెస్ కాన్ఫిరెన్స్ లో మాట్లాడుతూ.. ఇలా ఫీజుల నియంత్రణ జరగడం తొలిసారి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు పలురాష్ట్రాల్లో ఇలాంటి ప్రక్రియే జరుగుతున్నట్లు వివరించారు.

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న స్కూల్స్ ట్యూషన్ ఫీజు గరిష్ఠంగా ప్రాథమిక తరగతులకు రూ.10వేలకు మించి ఉండకూడదు. అదేవిధంగా ఉన్నత తరగతులకు రూ.12వేలకు మించి ఉండకూడదని అన్నారు. గత సంవత్సర కాలంలో పలు ఎడ్యుకేషనల్ సంస్థలను ఎంక్వైరీ చేసి పేరెంట్స్ తో మాట్లాడిన కమిషన్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఛైర్మన్ వెల్లడించారు.

‘ట్యూషన్, రిజిష్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్, లాబొరేటరీ, స్పోర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఇతర ఫీజులు కలిపే ఇందులోకి వస్తాయి. ఇవి కాకుండా ట్రాన్‌స్పోర్టేషన్, హాస్టల్ ఛార్జెస్ ఆప్షనల్ అని కాంతారావు తెలిపారు.

ఇంటర్మీడియట్ ఫీజు రూ.12వేల నుంచి రూ.24వేల వరకూ ఫిక్స్ చేశారు. కాలేజీలు ఉండే ప్రాంతాన్ని బట్టి.. వారు తీసుకున్న కోర్సును బట్టి ఫీజులు ఉంటాయన్నారు. ఏ స్కూల్, జూనియర్ కాలేజి అంతకుమించి వసూలు చేయకూడదని ఆదేశించారు. 80శాతం విద్యాసంస్థలకు ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని తెలిసింది.

ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం కాకూడదు. అలా పాల్పడితే వారి పట్ల కమిషన్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకుండా ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు.

కంప్లైంట్స్ చేయడానికి.. .
ఏదైనా కంప్లైంట్ ఉంటే పేరెంట్స్ 9150381111కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిటీ స్టాండర్డ్, టీచర్లకు ఇచ్చే శాలరీలు, అందుబాటులో ఉంటున్న ఫెసిలిటీస్ అన్నింటినీ మానిటరింగ్ చేస్తుంటుంది కమిషన్.