Kodali Nani Criticized Chandrababu, Pawan Kalyan : 2024 ఎన్నికలే చంద్రబాబు, పవన్‌కు చివరి ఎలక్షన్లు : కొడాలి నాని

టీడీపీ నేత లోకేశ్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేశ్‌కు సీఎం జగన్‌తో పోలీకా అన్న ఆయన.. ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్తా .. ఏదైనా చేస్తానంటే .. ఎత్తి లోపలేస్తారన్నారు. 2024 ఎన్నికలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చివరి ఎన్నికలని స్పష్టం చేశారు.

Kodali Nani Criticized Chandrababu, Pawan Kalyan : 2024 ఎన్నికలే చంద్రబాబు, పవన్‌కు చివరి ఎలక్షన్లు : కొడాలి నాని

Kodali Nani Criticized Chandrababu, Pawan Kalyan

Kodali Nani Criticized Chandrababu, Pawan Kalyan : టీడీపీ నేత లోకేశ్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేశ్‌కు సీఎం జగన్‌తో పోలీకా అన్న ఆయన.. ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్తా .. ఏదైనా చేస్తానంటే .. ఎత్తి లోపలేస్తారన్నారు. 2024 ఎన్నికలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. పకోడీ స్వామి, చెకోడీ భక్తుడు ఇద్దరూ ఆ తర్వాత కనిపించకుండా పోతారంటూ విమర్శించారు. చంద్రబాబు, పవన్‌ .. జగన్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.

అంతకముందు అమిత్‌షా, జూ.ఎన్టీఆర్‌ భేటీపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిన్నటి పర్యటనలో రామోజీరావు, జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలవడం పూర్తి వ్యూహాత్మకంగానే జరిగిందన్న వార్తల నేపథ్యంలో కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపయోగం లేకుంటే మోదీ, అమిత్‌షా ఎవరితోనూ మాట్లాడరన్నారు.

Kodali Nani Interesting Comments : అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ విస్తరించేందుకే ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారన్న ఆయన.. ఎన్టీఆర్‌ మద్దతుతో బీజేపీని బలపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. పాన్‌ ఇండియా స్టార్‌ అయిన ఎన్టీఆర్‌తో దేశవ్యాప్త ప్రచారానికి అవకాశం ఉందన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకే .. ఆయన ఢిల్లీ వెళ్లినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంలేదని విమర్శించారు.