Jagananna Vidya Deevena : ఈ నెల 16న వారి ఖాతాల్లోకి డబ్బులు.. క్లారిటీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఈ నెల(ఏప్రిల్) 16న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 9న డబ్బులు వేయాల్సి ఉంది. కానీ డబ్బులు రాలేదు. దీంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Jagananna Vidya Deevena : ఈ నెల 16న వారి ఖాతాల్లోకి డబ్బులు.. క్లారిటీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

Jagananna Vidya Deevena

Jagananna Vidya Deevena : జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఈ నెల(ఏప్రిల్) 16న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 9న డబ్బులు వేయాల్సి ఉంది. కానీ డబ్బులు రాలేదు. దీంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ తొలి ఏడాది విద్యార్థుల దరఖాస్తు పూర్తి కానందున వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 16న విద్యార్థలు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామంది.

నవరత్నాలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పేద
విద్యార్థులకు ఉన్నత విద్యను సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను చ్చింది. అర్హులైన విద్యార్థులందరికీ అన్ని కోర్సులకు విద్యా దీవెన
కింద ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద వసతి, భోజన ఖర్చులకు ఆర్ధిక సాయం చేస్తుంది.

విద్యా దీవెన కింద ఆయా కోర్సులకు చెల్లించాల్సిన ఫీజులను బట్టి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. అలాగే వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యా
సంవత్సరానికి అయ్యే వసతి, భోజన ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తారు. పాలిటెక్నిక్ కోర్సు చేస్తున్న వారికి రూ.15వేలు, ఐటీఐ కోర్సు చేస్తున్న వారికి
రూ.10వేలు ఇస్తారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోకి ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లుల ఖాతాల్లో నాలుగు త్రైమాసికాలకు డబ్బు
వేస్తారు. తల్లిదండ్రులు మాత్రం కాలేజీలకు వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా చెయ్యడం వల్ల తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లే వీలు ఉంటుందని, ఫీజులు
నేరుగా చెల్లించడం వల్ల.. అక్కడ విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకోవడం, పరిష్కారం కాని సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి
తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జగనన్న విద్యాదీవెన కింద ఏప్రిల్ 9న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడా తేదీని 16కి మార్చారు. అలాగే
ఏప్రిల్ 27న వసతిదీవెన కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నారు. దాదాపు 10 లక్షల
మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

ఇవే అర్హతలు:
* విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు.
* విద్యార్థి కుటుంబానికి మాగాణి భూమి 10 ఎకరాలలోపు… లేదా మెట్ట గానీ, మెట్ట, మాగాణి కలిపి గానీ 25 ఎకరాలలోపు ఉన్నవారికే ఈ పథకం
వర్తిస్తుంది.
* పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులకు మించి విస్తీర్ణమున్న భవనం ఉండకూడదు.
* కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు ఉండకూడదు. ఇందులో పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం
మినహాయింపునిచ్చింది.

విద్యాదీవెనకు దరఖాస్తు ఇలా..
జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా వివరాలు నమోదు
చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సంబంధిత కాలాజీ యాజమాన్యాలు విద్యార్థులు చేరిన 20రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.

వసతి దీవెనకు దరఖాస్తు ఇలా…
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే విద్యార్థి చిరునామా ధృవపత్రం, అడ్మిషన్ డాక్యుమెంట్, హాస్టల్ ఫీజ్ కట్టిన రసీదులు, ఆధార్, బ్యాంక్ అకౌంట్, బిలో
పావర్టీ లైన్, ఎకనామికల్లి వీకర్ సెక్షన్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఈ రెండు పథకాల్లో కీలక మార్పులు చేసింది. కేవలం యూనివర్సిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. కన్వీనర్ కోటాలో అడ్మిషన్లు పొందిన స్టూడెంట్స్ మాత్రమే ఈ పథకాలకు అర్హులను స్పష్టం చేసింది. ప్రైవేట్ ఎయిడెడ్, సెల్ఫ్
ఫైనాన్స్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, అన్ ఎయిడెడ్ పీజీ కాలేజీలకు ఈ పథకాలు వర్తించవు.