విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం : సజ్జల

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రకటనపై ప్రధానికి జగన్ లేఖ రాశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని చర్యలు చేస్తున్నామని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం : సజ్జల

Sajjala responds on Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ ప్రకటనపై ప్రధానికి జగన్ లేఖ రాశారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని చర్యలు చేస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంద శాతం కేంద్రం ఆస్తి అన్నారు. స్టీల్ ప్లాంట్ పై రాష్ట్రానికి హక్కు లేదన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా ఏం చేయాలో చూస్తున్నామని చెప్పారు.

విశాఖ ఉక్కును కాపాడుకుంటామన్నారు. ఇప్పటికే పార్లమెంట్ లో తమ ఎంపీలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం సీఎం జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు. కార్మిక సంఘాలు, అఖిలపక్షం నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు.

కృష్ణపట్నంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని పోస్కోను కోరామని తెలిపారు. పోస్కో ప్రతినిధులు కూడా కృష్ణపట్నం వచ్చి పరిశీలించారని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరామని చెప్పారు.