Ap Employees: సంక్రాంతికి ఏపీ సీఎం గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు 23శాతం ఫిట్‌మెంట్

ఏపీ ఉద్యోగులు ఎంతోకాలం నిరీక్షిస్తున్న ఫిట్‌మెంట్‌పై ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు.

Ap Employees: సంక్రాంతికి ఏపీ సీఎం గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు 23శాతం ఫిట్‌మెంట్

Prc

Ap Employees: ఏపీ ఉద్యోగులు ఎంతోకాలం నిరీక్షిస్తున్న ఫిట్‌మెంట్‌పై ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం బుజ్జగింపు తరహాలో రాష్ట్ర పరిస్థితిని వివరించి 23శాతం ఫిట్‌మెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఆదాయం, రెవిన్యూ పరిస్థితిని చెప్పుకొచ్చిన సీఎం.. ఉద్యోగుల కుటుంబ సభ్యుడిగా తాను చేయగలిగినంత మేలు చేస్తానంటూ హామీ ఇచ్చారు.

ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అంశాలన్నీ జాగ్రత్తగా విన్న సీఎం.. అన్నీ నోట్ చేసుకున్నానని చెప్పారు. ఇదే సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు అమల్లోకి రానున్నాయి.

పీఆర్సీ అమలు జూలై 1, 2018 నుంచి అమలు కానుండగా.. మానిటరీ బెనిఫిట్‌ అమలు మాత్రం ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్‌ 30లోగా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడబోతుంది.