No Summer Holidays : టీచర్లకు సెలవులు రద్దు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లకు మాత్రం సెలవులు రద్దు చేసింది.

No Summer Holidays : టీచర్లకు సెలవులు రద్దు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

No Summer Holidays

No Summer Holidays : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లకు మాత్రం సెలవులు రద్దు చేసింది. మే 20వ తేదీ వరకు ఉపాధ్యాయులకు సెలవులు ఉండవని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.

AP Schools Summer Holidays : ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..

ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20 తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఏపీలో స్కూళ్లు తిరిగి జూలై 4వ తేదీ నుంచి పున: ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.