Agrigold‌ : అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ..7లక్షల మందికి రూ.666.84 కోట్లు

అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ ఆసరాగా నిలిచింది. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ చేసింది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేసింది.

Agrigold‌ : అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ..7లక్షల మందికి రూ.666.84 కోట్లు

Cm Jagan (2)

AP government distributed : అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ అండగా నిలిచింది. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు డబ్బులు పంపిణీ చేసింది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేసింది. ఇప్పటికే 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి డబ్బులు చెల్లించింది. 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు చెల్లింపులు చేసింది. పెండింగ్ లో మరో 6 లక్షల క్లయిమ్స్ ఉన్నారు. మరో రూ.3,710 కోట్లు అవసరమని అంచనా. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అగ్రిగోల్డ్‌ డిపాజిట్లరకు చెల్లింపుల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.

దాదాపుగా 7లక్షల పైచిలుకు డిపాజిటర్లకు 666.84 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. మొత్తంగా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు అక్షరాల 10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే ఇచ్చామని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బాధితులకు న్యాయం చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అడుగులు ముందుకేశామని తెలిపారు. 2015లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి గత పాలకులు మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిట్‌ చేసిన కుటుంబాలు అన్నింటికీ.. కనీసం రూ.20వేలైనా తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈ రోజులో పూర్తి చేస్తున్నామని చెప్పారు.

దేశంలో ఎక్కడా జరగలేదు.. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును మన ప్రభుత్వమే బాధ్యతగా తీసుకుని పేద ప్రజలు నష్టపోకుండా ఉండాలని, మానవత్వాన్ని చూపుతూ చెల్లించామని గర్వంగా చెప్పారు. అగ్రిగోల్డ్‌ స్కాం అన్నది ఒక సారి గతంలోకి వెళ్లిచూస్తే… గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కాంగా తేటతెల్లంగా బయటపడిందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏ విధంగా కొట్టేయాలనుకున్నారో గతంలో అసెంబ్లీలో చెప్పామని గుర్తు చేశారు. అనే రాష్ట్రాల్లో విచారణలో, కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి, మన రాష్ట్రంలో ఎవ్వరు నష్టపోయారు? ఎంత నష్టపోయారు?అన్నదానిమీదే ధ్యాస పెట్టామన్నారు.

కూలి పనులు చేసుకుంటున్నవారు, చిన్న చిన్న వృత్తులు చేసుకున్నవారు, రిక్షా కార్మికులు.. ఇలాంటి వారిని గత ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి… మోసం చేసిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని గట్టిగా నిలదీస్తూ.. అధికారంలోకి రాగానే ఆదుకుంటామని చెప్పామని తెలిపారు. కోర్టు ఆమోదించిన జాబితా మేరకు రూ.10వేల లోపు డిపాజిటర్లు 3.4 లక్షల మంది రూ. 238.73 కోట్లు చెల్లించామని చెప్పారు.

అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదన్న నిశ్చయంతో… గ్రామ, వార్డు, వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి గుర్తించి 3.86 లక్షల మందికి 207.61 ఇవాళ డబ్బు ఇస్తున్నామని పేర్కొన్నారు. రూ.10 వేల నుంచి 20వేల లోపు డిపాజిట్‌ చేసిన రూ.3.14 లక్షల మందికి మరో రూ.459.23 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా దాదాపు 7 లక్షల మందికి పైగా రూ.666.84 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు జీవో నంబరు 31 ప్రజలను మోసం చేస్తూ ఇచ్చారని మండిపడ్డారు. 2019 ఫిబ్రవరిలో జీవో ఇచ్చి రూపాయి కూడా చెల్లించలేదన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు మోసాలు చేస్తూ వచ్చిందన్నారు. వారి కష్టాలను చూసి వారికి మంచి జరగాలని కోరుకుని తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం రూ.905.57 కోట్లు ఈరోజుతో చెల్లించినట్టు అవుతుందన్నారు.

ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్‌ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి ఆస్తులను అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్‌ దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా అడుగులు ముమ్మరంగా వేయడం జరుగుతుందన్నారు. మీ అందరి ఆశీస్సుల వల్ల, దేవుడి దయ వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడని పేర్కొన్నారు. మీ ఆశీస్సులు మన అందరి ప్రభుత్వం మీద ఉండాలని కోరారు.