మెడికల్ కోర్సుల ఫీజులను సవరిస్తూ… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: Chandu 10tv ,Published On : November 6, 2020 / 12:09 PM IST
మెడికల్ కోర్సుల ఫీజులను సవరిస్తూ… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Reduce the medical courses fees in AP government: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజమాన్య , కన్వీనర్, ఎన్ఆర్ఐ కోటాల కింద వైద్య విద్యను అభ్యసించే విద్యార్దుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఆయా కోర్సుల ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు, మైనార్టీ కాలేజీలకు ఈ ఫీజులు వర్తిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ గురువారం (నవంబర్ 5,2020) న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ ఫీజులను ఐదేళ్ల వరకు వసూలు చేస్తుండగా, ఇక నుంచి నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఆయన తెలిపారు.



తాజాగా నిర్ణయించిన వైద్య ఫీజులు ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా ట్యూషన్‌ ఫీజును రూ.15 వేలకు పెంచారు. గతంలో దీని ఫీజు రూ.12,155గా ఉంది. బీ కేటగిరీ ఫీజు ఇప్పటివరకు రూ.13,37,057 ఉండగా..తాజా ఉత్తర్వుల ప్రకారం రూ. 12లక్షలకు తగ్గించారు. గతంలో సీ కేటగిరీ ఫీజు రూ.33,07, 500 ఉండగా, ప్రస్తుతం రూ. 36 లక్షలుగా ఫైనల్ చేశారు. సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ.15లక్షలకు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.
https://10tv.in/80acres-allotted-for-medical-college-in-vizayanagaram/


ఈ ఫీజులు 2020 -2021 నుంచి 2022 -2023 వరకు అమల్లో ఉంటాయని సింఘాల్ వెల్లడించారు. ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనారిటీ, నాన్‌మైనారిటీ కాలేజీలకు నూతన ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం జీవోలో తెలిపింది. ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక మెడికల్, డెంటల్ అభ్యర్దులకు విధిగా స్టైఫండ్ చెల్లించాలని ఆయన తెలిపారు.