రెండు గంటలే, శానిటైజర్ వాడొద్దు.. దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: naveen ,Published On : November 11, 2020 / 12:07 PM IST
రెండు గంటలే, శానిటైజర్ వాడొద్దు.. దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

టపాసుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం:
అంతేకాదు క్రాకర్స్ అమ్మకాలపైనా ప్రభుత్వం నిషేధం విధించింది. కాలుష్య రహిత టపాసులు మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. అలాగే దీపావళి సామాగ్రి అమ్మే షాపుల దగ్గర శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది. ప్రజలు, వ్యాపారులు ఈ నిబంధనలను తప్పక పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.


https://10tv.in/diwali-festival-ban-on-crackers-these-are-the-reasons/
కరోనా, కాలుష్యం నేపథ్యంలో కీలక నిర్ణయం:
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బాణాసంచా వాడకాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీపావళిపై పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. దీపావళికి టపాసుల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం.. కాలుష్యం వల్ల అది మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, కర్నాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం టపాసులు కాల్చుకోవడానికి రెండు గంటలు అనుమతి ఇచ్చింది.

https://www.youtube.com/watch?v=UrUdZQgB8AQ