ఏపీలో మరో కొత్త స్కీమ్.. సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం

ఏపీలో మరో కొత్త స్కీమ్.. సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం

social welfare schemes calendar: ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రకటించింది. 23 పథకాలకు నెలవారీ షెడ్యూల్ ను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విడుదల చేశారు. మొత్తం 23 పథకాలను నెలవారీగా అమలు చేయనున్నారు. ఈ ఏడాది(2021) ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది(2022) జనవరి వరకు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒకటికి మించి పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాల్లో 8 నుంచి 12 కోట్ల మంది లబ్ధిదారులున్నట్లు వెల్లడించారు. కాగా, ఈసారి కొత్తగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.

ఏప్రిల్ 2020: జగనన్న వసతి దీవెన పథకం కింద 15లక్షల మందికి పైగా విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీల చెల్లింపు
ఏప్రిల్ 2021: జగనన్న విద్యా దీవెన పథకం కింద నాలుగు విడతలుగా ( ఏప్రిల్-జులై-డిసెంబర్-ఫిబ్రవరి) సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపు. 18లక్షల 80వేల మందికి లబ్ధి.
ఏప్రిల్ 2021: రైతులకు వడ్డీ లేని రుణాలు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 66.11 లక్షల మందికి వడ్డీలేని రుణాలు
ఏప్రిల్ 2021: 90.37లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
మే 2021: పంటల బీమా కింద రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రైతులకు బీమా చెల్లింపు
మే 2021: రైతు భరోసా పథకం కింద మూడు దఫాలుగా (మే-అక్టోబర్-జనవరి) 54 లక్షల మందికి రైతులకు లబ్ధి
మే 2021: మత్స్యకార భరోసా కింద 1.09 లక్షల మందికి ఆర్ధిక సాయం
మే 2021: మత్స్యకార భరోసా పథకం కింద 19వేల పడవలకు డీజిల్ సబ్సిడీ
జూన్ 2021: జగనన్న విద్యాకానుక పథకం కింద 42లక్షల మందికి బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ
జూన్ 2021: వైఎస్ఆర్ చేయూత పథకం కింద 24 లక్షల మందికి రూ.17,250 చొప్పున ఆర్ధిక సాయం
జూలై 2021: వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం పథకం కింద 2 లక్షల మందికి రూ.10వేల చొప్పున ఆర్ధిక సాయం
జూలై 2021: వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 3.27లక్షల మందికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం
ఆగస్టు 2021: 25 లక్షల మంది రైతులకు వడ్డీలేని రుణాలు
ఆగస్టు 2021: 9వేల ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు
ఆగస్టు 2021: నేతన్న నేస్తం పథకం కింద 81వేల మందికి ఆర్ధిక సాయం
ఆగస్టు 2021: 3లక్షల 34వేల మంది మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపు
సెప్టెంబర్ 2021: వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 87లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెల్లింపులు
అక్టోబర్ 2021: జగనన్న తోడు పథకం కింద 9.05లక్షల మందికి సాయం
అక్టోబర్ 2021: జగనన్న చేదోడు పథకం కింద టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆర్ధిక సాయం.. 2.95లక్షల మందికి లబ్ధి
నవంబర్ 2021: అగ్రవర్ణాల పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకం కింద రూ.15వేలు ఆర్ధిక సాయం. 6 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారని అంచనా
జనవరి 2022: జగనన్న అమ్మఒడి పథకం కింద 44లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం.