AP PRC : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సాయంత్రమే పీఆర్సీ ప్రకటన

సోమవారం మధ్యాహ్నం ఆ నివేదిక సీఎం జగన్ చేతికి అందనుంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫిట్ మెంట్ ను ఖరారు చేయనున్నారు సీఎం జగన్...

AP PRC : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సాయంత్రమే పీఆర్సీ ప్రకటన

Ap Prc

AP Government Statement On PRC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది. 2010, డిసెంబర్ 13వ తేదీ సోమవారం దీనిపై ప్రకటన చేయనుందని సమాచారం. ఇప్పటికే దీనిపై పది రోజుల్లో ప్రకటన చేయనున్నామని స్వయంగా సీఎం జగన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఆర్సీ ఎంతివ్వాలనే దానిపై కమిటీ ఓ నివేదిక తయారు చేసింది.

Read More : Capital Amaravati: ‘రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతివ్వాలి’

సోమవారం మధ్యాహ్నం ఆ నివేదిక సీఎం జగన్ చేతికి అందనుంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫిట్ మెంట్ ను ఖరారు చేయనున్నారు సీఎం జగన్. దీంతో ఎంత ప్రకటిస్తారనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. సీఎం నిర్ణయం తీసుకున్న అనంతరం ఉద్యోగ సంఘాలకు అధికారలు సమాచారం ఇవ్వనున్నారు. సాయంత్రం పీఆర్సీపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు సీఎం జగన్.

Read More  :Sai Dharam Tej : సినిమాలకు ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్.. కొత్త సంవత్సరంలో షూటింగ్??

పీఆర్సీ విషయంలో…ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాలని ఇటీవలే నిర్ణయించాయి. అందులో భాగంగా కార్యాచరణను సైతం ప్రకటించాయి. పీఆర్సీ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని చెబుతున్నా..ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్లే తాము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమౌతున్నట్లు వెల్లడించాయి. ఈ క్రమంలో..ఏపీలో సృష్టించిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. చిత్తూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాలు కలిశాయి. పీఆర్సీ విషయాన్ని ప్రస్తావించాయి. దీంతో పది రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేయడం జరుగుతుందనే విషయాన్ని ఆయన వారికి చెప్పారు.

Read More : Paperless Dubai: ప్రపంచంలోనే తొలి కాగిత రహిత దేశంగా దుబాయ్

ఇక పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలు పలు డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 2018 జులై 01వ తేదీ నుంచి పీఆర్సీ సిఫార్సులను అమలు చేయాలని, 55 పర్సంటేజీ ఫిట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.