ల్యాప్‌టాప్ ఉంటే ఆన్‌లైన్. లేదంటే టీవీపాఠాలు. మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల సంగతేంటి?

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 02:27 PM IST
ల్యాప్‌టాప్ ఉంటే ఆన్‌లైన్. లేదంటే టీవీపాఠాలు. మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల సంగతేంటి?

కరోనా కాలం..అన్ని స్కూల్స్ కు సుదీర్ఘకాలపు సెలవులు ఇచ్చేసింది.దీంతో స్కూల్స్ అన్నీ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా పాఠాలు చెప్పేస్తూ నానా హంగామా చేస్తున్నాయి. ఈ ఆన్ లైన్ టీచింగ్ విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయంటూ మొత్తుకుంటున్నారు సైకాలజిస్టులు. అంతేకాదు ఆన్ లైన్ చదువుల పేరుతో ప్రైవేటు స్కూల్స్ ఫీజుల్ని అధికంగా వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి.

ప్రైవేటు స్కూల్స్ చదువులు ఇలా..మూడు రకాలుగా..

హైటెక్ ఎడ్యుకేషన్ : విద్యార్ధుల కోసం వారికి అనుగుణంగానే హైటెక్, లోటెక్, నోటెక్‌ ఎడ్యుకేషన్ లతో టీచింగ్ చేస్తున్నాం..ఆన్‌లైన్‌లో మొత్తం సిలబస్‌ను, టెక్ట్స్ బుక్స్ లను ఎన్‌సీఈఆర్‌టీ దీక్ష ప్లాట్‌ఫామ్‌లో పొందుపరిచాం. అంతేకాదు..స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సు కింద వెబ్‌నార్‌ ట్రైనింగ్ నిర్వహిస్తున్నామనీ..టీచర్లు పిల్లలకు అనుగుణంగా ‘అభ్యాస’ అనే యాప్‌ రూపొందించామని చెబుతున్నాయి.

లో టెక్ : టెక్నాలజీ ఉన్నవారు దూరదర్శన్, రేడియో కేంద్రాల ద్వారా పాఠాలు వినేలా చేస్తున్నాం. దూరదర్శన్‌ ద్వారా 1.80 లక్షల మంది విద్యార్థులకు టీచింగ్ అందిస్తున్నామని చెబుతున్నాయి.

నోటెక్ :1 నుంచి 6 క్లాస్ విద్యార్ధులకు విద్యావారధి కింద 18 లక్షల వర్క్‌ బుక్స్‌ అందించామనీ..నోటెక్‌ (టెక్నాలజీ అందుబాటులో లేనివారు) విద్యార్థులకు వాహనాలు, టీచర్ల ద్వారా బోధన చేస్తున్నామని చెబుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధన ఇలా..
ప్రభుత్వ స్కూల్స్ లో ఎక్కువ మంది పిల్లలు గ్రామీణ, నిరుపేద వర్గాలకు చెందిన వారే ఉంటారు. దీంతో ప్రభుత్వం అటువంటి విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా టీచింగ్ అందించటానికి యత్నిస్తోంది. టెక్నాలజీ సౌకర్యం ఉన్నవారికి ఆన్‌లైన్‌లో టెక్ట్స్ బుక్స్ ను అందుబాటులో ఉంచింది.

మరికొందరికి టీవీలు, వీడియోల ద్వారా క్లాసులు చెబుతోంది. డిజిటల్‌ టీచింగ్ అంటే సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లతోను వారానికి ఒకటి రెండు రోజులు స్కూళ్లలో టీచర్లతో డౌట్స్ క్లియర్ చేస్తోంది.

కొంతవరకైనా స్కూళ్లు తెరవడం మంచిదే
సప్తగిరి చానెల్‌ టీచింగ్, వర్క్‌ బుక్స్‌ ఇవ్వడం వల్ల ఎడ్యుకేషన్ ఇయర్ కు కొంత గ్యాప్‌ కవర్ అవుతుంది. అలాగే కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలు డిజిటల్‌ టీచింగ్ తో పాటు బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నాయి. ఎక్కువగా ఆన్‌లైన్‌లో టీచింగ్ చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ లో చదివే విద్యార్ధుల మధ్య తేడాను పెంచుతుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిపుణులు సూచనలు..
కరోనా లేని ప్రాంతాలను గుర్తించి షిప్ట్‌ల పద్ధతిలో స్కూల్స్ ని నడపాలి. ఆన్‌లైన్‌ టీచింగ్ తో పాటు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానం ఉండాలి.సిలబస్‌ను అవసరం మేరకు తగ్గించాలని సూచిస్తున్నారు.