కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి..ధరలు నిర్ణయం

  • Published By: bheemraj ,Published On : July 9, 2020 / 01:21 AM IST
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి..ధరలు నిర్ణయం

కరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని ప్రభుత్వం సూచించింది.

కరోనా వైద్యానికి అయ్యే ఫీజులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే మరికొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది.
కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరలు నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ప్రభుత్వ నిర్ణయించిన ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరలు
నాన్ క్రిటికల్ కరోనా చికత్సకు రోజుకు రూ.3,250
ఐసీయూలో ఆక్సిజన్ తో చికిత్సకు రోజుకు రూ.5,980
ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్సకు రోజుకు రూ.9,580
వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రోజుకు రూ.5.480
ఐసీయూలో క్రిటికల్ కేర్ చికిత్సకు రోజుకు రూ.10,380
ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా చికిత్సకు రోజుకు రూ. 6,280