Sajjala Ramakrishna Reddy : సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా : సజ్జల

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నది నిజం అయితే ఎప్పుడో బయటకి వచ్చేదన్నారు. అక్కడ అందరి ఇల్లు 100 మీటర్ల దూరంలోని ఉంటాయని తెలిపారు.

Sajjala Ramakrishna Reddy : సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా : సజ్జల

SAJJALA

Sajjala Ramakrishna Reddy  : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా జరుగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నది నిజం అయితే ఎప్పుడో బయటకి వచ్చేదన్నారు. అక్కడ అందరి ఇల్లు 100 మీటర్ల దూరంలోని ఉంటాయని తెలిపారు. సీబీఐ సొంతంగా డిఫరెంట్ లైన్ లో తీసుకుని వెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ రిపోర్టును పక్కన పెట్టేశారని వెల్లడించారు. గూగుల్ టేక్ అవుట్ అనేది కొత్తగా వింటున్నామని అన్నారు. సీబీఐ చెప్తున్న పేర్లు దశాబ్దాల కాలం నుండి వివేకా వెంట ఉన్నారనేనని అన్నారు.

టీడీపీ కోరుకుంటున్న లైన్ లోనే సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపించారు. వాగ్మూలంలో చెప్పనవి కూడా రాస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కో-ఆర్డినేషన్ లో విచారణ జరుగుతుందని విమర్శించారు. సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై అనేక ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు. వివేకా హత్య జరిగాక అనేక కథనాలు బయటకి వచ్చాయని తెలిపారు. హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. వైసీపీ పెట్టినప్పుడు వివేకా తమ పార్టీలో లేరు.. కాంగ్రెస్ లో ఉన్నారని పేర్కొన్నారు.

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు.. టీఎస్ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో సంచలన విషయాలు

జగన్ కోరిక మేరకు వివేకా తమ పార్టీలోకి వచ్చారని వెల్లడించారు. తమ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారని.. కొన్ని విషయాల్లో సలహాలు, సూచనలు తీసుకునే వాళ్ళమన్నారు. తండ్రిలానే అవినాష్ గెలుపు కోసం పనిచేశారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూ నిలిపి గెలిపించడానికి ప్రయత్నం చేశామని చెప్పారు. బి టెక్ రవి, అధినారాయన రెడ్డిలను ఎందుకు సీబీఐ విచారణ చెయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, బి టెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ల కాల్ రికార్డ్స్ చూస్తే తెలుస్తుందన్నారు. జగన్, భారతికి వచ్చినట్టే వాళ్ళకి తెల్లవారు జామున ఫోన్ కాల్స్ వెళ్లి ఉంటాయన్నారు.

అసలైన వారిని విచారణ చేయకుండా అవినాష్, భాస్కర్ రెడ్డిల చుట్టూ తిప్పు… మా వైపు తప్పు ఉంటే సీబీఐ విచారణ ఎందుకు వేస్తామని అన్నారు. చంద్రబాబు లా సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా నిర్ణయం తీసుకునే వాళ్ళం కదా అని పేర్కొన్నారు. విచారణ కోసం పిలిచి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని చెప్పారు. వెళ్ళిన 10 మందిలో ఐదుగురు తనతో చెప్పారని తెలిపారు. 2024 ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ కుట్ర చేస్తున్నారని చెప్పారు. హత్యలో అనేక ఆధారాలు ఉన్నాయని.. ఆయన కుటుంబంలో విబేధాలు ఉన్నాయని చెప్పారు. ఆర్థిక పరమైన అంశాల్లో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.

Phone Tapping In YSRCP : ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకేముంది? చంద్రబాబుకి ఇది అలవాటే-సజ్జల

రెండవ పెళ్ళి వార్తలపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీశారు. అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ టీడీపీ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఒకవేళ అరెస్టు చేస్తే అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదన్నారు. హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం మూడు నెలలు ఉందన్నారు. అప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. జగన్ పై అవినీతి కేసులు పెట్టినప్పుడు ప్రతిపక్షంలో లేరా.. అప్పుడలా చేయ గలిగారని పేర్కొన్నారు. చంద్రబాబు వేసిన విత్తనాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఎవరికి తెలియదన్నారు. చంద్రబాబు లాంటి మ్యానిక్యులేటెడ్ పొలిటీషియన్ ఎక్కడా ఉండబోడని విమర్శించారు.