AP PRC : పీఆర్సీ జీవోలు రద్దు చేశాకే చర్చలు, తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘాలు

మేము చర్చలకు రాలేదు. ముఖ్యమైన మూడు డిమాండ్స్ ని మంత్రుల కమిటీతో చెప్పాము. వాటిని మీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ... చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంది.

AP PRC : పీఆర్సీ జీవోలు రద్దు చేశాకే చర్చలు, తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘాలు

Ap Prc

AP PRC : ఏపీలో పీఆర్సీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఉద్యోగ సంఘాలు బెట్టు దిగడం లేదు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి.

తాము మంత్రుల కమిటీతో చర్చలకు రాలేదని స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆస్కార్ రావ్ అన్నారు. తమ మూడు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకే వచ్చామన్నారు. జేఏసీలో ఉన్న సభ్యులు మూడు అంశాలపై లేఖ ఇవ్వగా, మళ్లీ కలిసి మాట్లాడుకుందామని మంత్రుల కమిటీ చెప్పిందని అన్నారు. బహుశా ఎల్లుండి చర్చలు జరగవచ్చన్నారు.

Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని మంత్రుల కమిటీతో తాము చెప్పామని స్టీరింగ్ కమిటీ సభ్యుడు వైవీ రావ్ చెప్పారు. జీవోలు రద్దు చేసిన తర్వాతే చర్చలు అని చెప్పామన్నారు. ప్రస్తుతం సీఎస్ లేరు.. సీఎస్, సీఎంతో మంత్రులు మాట్లాడాక.. మళ్లీ మీతో మాట్లాడతామని తమతో చెప్పారని వైవీ రావ్ తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందనే ఆశాభావం ఉందన్నారు.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

”మేము చర్చలకు రాలేదు. ముఖ్యమైన మూడు డిమాండ్స్ ని మంత్రుల కమిటీతో చెప్పాము. వాటిని మీద ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి … చర్చలకు రావాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంది. సీఎస్ తో చర్చించి మరోసారి మాట్లాడుకుందాం అని మంత్రులు, సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఉద్యోగులుగా మేము ఎపుడూ ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయాలనే ఎదురు చూస్తాం” అని ఆస్కార్ రావ్ అన్నారు.

”పీఆర్సీ సాధన సమితి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పాం. మూడు అంశాలు పరిష్కరిస్తే చర్చలకు వస్తామని చెప్పాం. మా తదుపరి కార్యాచరణ కొనసాగుతుంది. డిమాండ్లను పరిష్కరించకుండా చర్చలకు వెళ్లేది లేదు. పీఆర్సీ జీవోలను నిలుపుదల చేయాలని కోరాం. డిసెంబర్ నెల వేతనం చెల్లించేలా చూడాలని కోరాం” అని స్టీరింగ్ కమిటీ సభ్యుడు వైవీ రావు అన్నారు.

నిన్నటిలాగే మంత్రుల కమిటీ నేడు కూడా ఉద్యోగుల కోసం ఎదురు చూసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామన్నారు. స్టీరింగ్‌ కమిటీ నేతలు వచ్చి తమను కలిశారని తెలిపారు. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని కోరారని చెప్పారు. అయితే, ఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు సజ్జల.

ఏదీ అడక్కుండానే ముఖ్యమంత్రి జగన్ అన్నీ ఇచ్చారని చెప్పారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని ప్రభుత్వం అప్పీల్ చేస్తోందన్నారు. ఏవైనా మార్పులు ఉంటే వాటి గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల స్పష్టం చేశారు. మళ్లీ 27వ తేదీన చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరామని సజ్జల తెలిపారు.