GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది.

GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం

GPF Money : ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైంది. ఏకంగా 90వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి దాదాపు 800కోట్ల రూపాయల డబ్బు డెబిట్ అయ్యింది. 6 నెలలుగా డీఏ రూపంలో ప్రభుత్వం ఇచ్చిన డబ్బు డెబిట్ అయిందని ఉద్యోగులు అంటున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

డబ్బులు తీసుకున్నది ఎవరు అని వారు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటో తెలుసుకుందామని వెళితే ఆర్థిక శాఖ అధికారులు అందుబాటులో లేరని అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇదే తరహాలో డబ్బు తీసుకుని మళ్లీ జమ చేసిందని ఉద్యోగులు అంటున్నారు.

”రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి డబ్బు డెబిట్‌ అయ్యింది. ఉద్యోగుల ఖాతాల నుంచి నగదు విత్‌ డ్రా చేసుకున్నట్టు గత రాత్రి మేసేజ్ లు వచ్చాయి. నా వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83వేలు విత్‌డ్రా చేశారు. డబ్బు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదు. పీఆర్సీ డీఏ ఎరియర్స్‌ జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నారు. గడచిన 6 నెలలుగా ఇచ్చిన డీఏ ఎరియర్స్‌ను మళ్లీ వెనక్కి తీసుకున్నారు” అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఆరోపించారు.

”గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారు. తాజాగా మొత్తం 90వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు వెనక్కి తీసుకున్నారు. ఆర్థికశాఖకు ఫిర్యాదు చేసేందుకు వెళితే.. అధికారులు అందుబాటులో లేరు. ఈ తరహా ఘటనలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా లేక ఉన్నతాధికారుల తప్పిదమో తెలియడం లేదు. ఉద్యోగుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేయడం నేరం” అని సూర్యనారాయణ అన్నారు.

దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని సూర్యనారాయణ తెలిపారు. మార్చి నెలలో జరిగిన లావాదేవీలను అకౌంటెంట్‌ జనరల్‌ తమకు ఇప్పటి వరకు తెలియజేయకపోవడం కూడా తప్పిదమేనన్నారు. ఆర్థిక శాఖలోని సీఎఫ్ఎంఎస్ లో ఉన్న సీపీయూ యూనిట్ వద్ద తమ శాలరీ ఖాతాల నుంచి విత్ డ్రా చేసే సాంకేతికత ఉందని, ఇది ఎంత వరకు చట్టబద్దమని ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ జరగాలని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.