పేదోడి సొంతింటి కల : ఏపీలోని 8 జిల్లాలకు నిధుల విడుదల

  • Published By: madhu ,Published On : June 23, 2020 / 04:20 AM IST
పేదోడి సొంతింటి కల : ఏపీలోని 8 జిల్లాలకు నిధుల విడుదల

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిధులను కూడా మంజూరు చేస్తున్నారు. కరోన వేళ సీఎం జగన్ పలు పథకాల అమల్లో స్పీడును పెంచారు.

అందులో పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే. ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని ఆ 8 జిల్లాలోని పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఇళ్ల పథకం కోసం తొలి విడతలో 8 జిల్లాలకు రూ.459.32 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి 2020, జూన్ 22వ తేదీ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.

తొలిదశలో కర్నూలు, నెల్లూరు జిల్లాలకు రూ.80 కోట్లు, విశాఖపట్టణానికి రూ.39.32 కోట్లు, అనంతపురం జిల్లాకు రూ.60 కోట్లు, శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప జిల్లాలకు 50 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. 

రాష్ట్రంలోని పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జులై 08వ తేదీన ప్రారంభించబోతున్నారు.

వాస్తవానికి ఉగాది పండుగ సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని భావిస్తున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వాయిదా పడింది. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని అనుకున్నా కరోనా కారణంగా తాత్కాలిక బ్రేక్ పడింది. చివరకు జులై 08వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. 

Read: ఏపీలో కరోనా విజృంభణ…9, 372 కు చేరిన పాజిటివ్ కేసులు.. 111 మంది మృతి