AP DSC : డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, త్వరలోనే పోస్టింగ్

AP DSC : డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, త్వరలోనే పోస్టింగ్

Ap Dsc

AP DSC Candidate s: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే జీవో జారీ చేసి వారికి పోస్టింగ్ లు ఇస్తామంది. డీఎస్సీ 2008 ఎగ్జామ్స్ అంశం 13 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్ పెద్ద మనసుతో వారికి అండగా నిలిచారని చెప్పారు. సీఎం జగన్ 2వేల 193 మంది అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించేందుకు ఆమోదం తెలిపారని చెప్పారు. త్వరలో జీఓ ఇచ్చి వారికి పోస్టింగ్ ఇస్తామని అన్నారు. ఈ నియామకాలతో ఏటా సుమారు 50 నుండి 60 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని మంత్రి చెప్పారు.

2014 మేనిఫెస్టోలో పెట్టి డీఎస్సీ అభ్యర్థులను టీడీపీ మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు మొసలి కన్నీరు కార్చి, క్యాబినెట్ తీర్మానం చేసి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. 1998 డీఎస్సీపై కమిటీలు వేసి మరి చంద్రబాబు మోసం చేశారని అన్నారు. 1998కు సంబంధించి 36 మందిని ఈరోజు గుర్తించామన్న మంత్రి సురేష్, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

డీఎస్సీ 2008 అభ్యర్ధుల అంశం చాలాకాలంగా అపరిష్కృతంగా ఉంది. డీఎస్సీలో మెరిట్ పాటించకపోవడం వల్ల చాలామంది అభ్యర్ధులు నష్టపోయారు. ఈ అంశంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌ను కలిసి సమస్యను విన్నవించారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్ధులకు కాంట్రాక్టు పద్ధతిలో టీచర్లుగా నియమిస్తామని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 193 మంది నిరుద్యోగ టీచర్లకు ఉద్యోగం లభించనుంది. ఇప్పటికే వీరిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని..వీరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్‌లో మినహాయించాలని సీఎంకి విన్నవించారు.