AP Govt : వైద్య శాఖలో 20వేల పోస్టుల భర్తీకి జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్‌ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా సిబ్బంది నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వాక్‌ఇన్‌ ఇంటర్వూలతో ప్రత్యేకంగా సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు.

AP Govt : వైద్య శాఖలో 20వేల పోస్టుల భర్తీకి జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Ap Govt Green Signal For Recruitment Of Doctors

AP Govt Recruitment : కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్‌ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా సిబ్బంది నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వాక్‌ఇన్‌ ఇంటర్వూలతో ప్రత్యేకంగా సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు.

ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, స్టాప్‌ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, పురుష, మహిళా నర్సుల ఆర్డర్లీ నియామకాలు చేపడుతున్నారు. ఒకవైపు ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు బెడ్లను ఏర్పాటు చేస్తూనే మరోపక్క వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెగ్యులర్‌ నియామకాలకు అదనంగా ప్రత్యేకంగా కోవిడ్‌-19 కింద వీటిని ప్రభుత్వం చేపడుతోంది.