AP Govt : జనంలోకి వెళుతాం, జనాభిప్రాయంతోనే మూడు రాజధానుల ఏర్పాటు!

ప్రజలందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటూ సభలో ప్రకటించిన సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.

AP Govt : జనంలోకి వెళుతాం, జనాభిప్రాయంతోనే మూడు రాజధానుల ఏర్పాటు!

Ap Govt Withdrawls On Three Captials Bill

AP Capital Amaravathi : మూడు రాజధానుల విషయంలో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఏపీ సర్కార్‌.. నెక్ట్స్‌ ఏం చేస్తుందన్నది ఆసక్తి కరంగా మారింది. ప్రజలందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామంటూ సభలో ప్రకటించిన సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. ఏపీ మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం తగ్గేదే లే అంటోంది. సమగ్ర బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెడతామన్నారు సీఎం జగన్. తన ఇల్లు అమరావతిలోనే ఉందని…ఈ ప్రాంతమంటే వ్యతిరేకత లేదన్నారు. టీడీపీ చెప్పినట్టు లక్ష కోట్ల రూపాయలు అంచనా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని… అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

Read More : AP High Court : మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలి : ఏపీ హైకోర్టు

మరోవైపు… మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఏపీలో వికేంద్రీకరణ కోసం రాజధానిపై సలహాలు, సూచనల కొరకు 2019 సెప్టెంబర్‌ 13న రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ.. ప్రజల అభిప్రాయాలు సేకరించింది. మరోవైపు.. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ తొలిసారిగా అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఆ తర్వాత 2019 డిసెంబర్‌ 20న జీఎన్‌ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు 2019 డిసెంబర్‌ 29న రాష్ట్రం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే.. 2020 జనవరి 3న బోస్టన్‌ కన్సెల్టెన్సీ గ్రూపు తన నివేదికను సమర్పించింది.  రెండు కమిటీల నివేదికలపై హైపవర్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది.

Read More : Customer Care Number : కాల్ నెంబర్‌‌కు ఫోన్ చేస్తున్నారా..SBI హెచ్చరికలు

అనంతరం 2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది. 2020 జనవరి 20న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో భాగంగానే 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు బిల్లును తీసుకురాగా.. ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. దాని తరువాత న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్‌ 16న రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లులను పంపించింది. అయితే… మధ్యలో న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు ఉండటంతో.. గవర్నర్ న్యాయసలహాలు తీసుకున్నారు. అనంతరం.. 2020 జులై 31న పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. అయితే ఈ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ఏపీ సీఎం జగన్‌ 2021, నవంబర్ 22వ తేదీ సోమవారం సభలో ప్రకటించారు.. అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోని త్వరలో ఓ కొత్త బిల్లును తీసుకోస్తామన్నారు జగన్‌.