ఏపీ ఎంసెట్ 2020, ఫలితాలు. ర్యాంకుల వివరాలు

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 11:04 AM IST
ఏపీ ఎంసెట్ 2020, ఫలితాలు. ర్యాంకుల వివరాలు

ap govt releases : ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ 2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2020, అక్టోబర్ 10వ తేదీ ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి పరీక్షలు జరిగాయన్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 1,85,936 మంది, 87 వేల 652 మంది అగ్రికల్చర్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.



ఇంజినీరింగ్ (1,56,953), అగ్రికల్చర్ (75,858) మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 14 టెస్టు సెంటర్లలో రెండు సెషన్లలో పరీక్ష జరిగిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే..ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. బైపీసీ విభాగంలో 91.77 శాతం ఉందన్నారు.



ఇంజినీరింగ్ విభాగంలో 1,33,066 మంది ఉత్తీర్ణత (84.78 శాతం) సాధించారన్నారు. ఇందులో బాలురు (79,030), అమ్మాయిలు (54,036) పరీక్ష పాస్ అయ్యారన్నారు.



అగ్రికల్చర్ విభాగంలో 69 వేల 619 మంది ఉత్తీర్ణత (91.77 శాతం) సాధించారన్నారు. బాలురు (22,420), అమ్మాయిలు (47,196) పాస్ అయ్యారన్నారు.



కోవిడ్ బారిన పడి పరీక్షను కొంతమంది రాయలేకపోయారని, వీరు మొత్తం 97 మంది ఉన్నారన్నారు. 14 సెంటర్లలో అక్టోబర్ 07వ తేదీన జరిగిన పరీక్షకు 77 మంది హాజరయ్యారన్నారు.



టాప్ టెన్ ర్యాంకులు ఇంజినీరింగ్
1. వావిలపల్లి సాయినాథ్ (విశాఖపట్టణం, ఏపీ). 2. కుమార్ సత్యం, (హైదరాబాద్, తెలంగాణ). 3. గంగుల భువన్ రెడ్డి (పొద్దుటూరు, ఏపీ). 4. లిఖిత్ రెడ్డి, హైదరాబాద్, తెలంగాణ). 5. కౌశల్ కుమార్ రెడ్డి (సికింద్రాబాద్, తెలంగాణ). 6. వెంకట దత్త శ్రీహర్ష (రాజమండ్రి, ఏపీ) 7. సాయితేజ (వారణాసి, హైదరాబాద్). 8. రాజ్ పాల్ (హైదరాబాద్, తెలంగాణ). 9. కొత్తకోట కృష్ణ సాయి (శ్రీకాకుళం, ఏపీ). 10. రంగా జితేంద్ర (విజయనగరం, ఏపీ).



టాప్ టెన్ ర్యాంకులు అగ్రికల్చర్
1. గుత్తి చైతన్య సింధు (తెనాలి, ఏపీ). 2. త్రిపురనేని లక్ష్మీ (గుంటూరు, ఏపీ). మనోజ్ కుమార్ (తిరుపతి, ఏపీ). 4. దర్శి విజయసాయి (నెల్లూరు, ఏపీ). 5. అవుల శుభంగ్ (హైదరాబాద్, తెలంగాణ). 6. అవిష్ రెడ్డి (మేడ్చల్, తెలంగాణ). ఎర్రగుడి లిఖిత (కడప, ఏపీ). 8 జడా వెంకట వినయ్ (కడప, ఏపీ). 9. నిఖిత్ వర్మ (కర్నూలు, ఏపీ). 10. రేవంత్ (గుంటూరు, ఏపీ).