Junior Doctors In AP : చర్చలు సఫలం, విధుల్లోకి జూనియర్ వైద్యులు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు కాసేపటి క్రితం ముగిశాయి. చర్చలు సఫలం అయ్యాయి. 2021, జూన్ 09వ తేదీ బుధవారం నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడారు. ఇన్సెంటివ్ ప్రస్తుతానికి కల్పించలేమని, ఆరు నెలల వేతనం పెంచాల్సి ఉందని..అందులో ఇన్సెంటివ్ అంశాన్ని పరిశీలిస్తామని హామీనిచ్చారని తెలిపారు.

Junior Doctors In AP : చర్చలు సఫలం, విధుల్లోకి జూనియర్ వైద్యులు

Ap Doctors

AP Junior Doctors Association : ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు కాసేపటి క్రితం ముగిశాయి. చర్చలు సఫలం అయ్యాయి. 2021, జూన్ 09వ తేదీ బుధవారం నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడారు. ఇన్సెంటివ్ ప్రస్తుతానికి కల్పించలేమని, ఆరు నెలల వేతనం పెంచాల్సి ఉందని..అందులో ఇన్సెంటివ్ అంశాన్ని పరిశీలిస్తామని హామీనిచ్చారని తెలిపారు.

కోవిడ్ రోగులకు చికిత్స అందించిన రోజీ అనే వైద్యురాలు చనిపోయిందని, ప్రభుత్వం తరపున రూ. 25 లక్షలు మంజూరు అవుతుందని, వీలైనంత త్వరగా..రిలీజ్ చేయాలని కోరుతున్నామన్నారు. స్టైఫండ్ ను ఆరు నెలల్లో పెంపును అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. తాము అడిగిన డిమాండ్స్ కు సానుకూలంగా సీఎం జగన్ స్పందించారని..ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. సీనియర్ రెసిడెంట్స్ (మూడు సంవత్సరాలు కంప్లీట్) లకు రూ. 45 వేల నుంచి రూ. 75 వేలు పెంచారని, హెల్త్ ఇన్సూరెన్స్ (కోవిడ్ డ్యూటీ చేస్తూ..మరణిస్తే) వారి కుటుంబానికి భరోసా కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చామని..ఇందుకు సానుకూలంగా స్పందించారన్నారు. కోవిడ్ ఇన్సెంటీవ్స్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిశీలన చేస్తామని చెప్పారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా..మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని మంత్రి హామీనిచ్చారని తెలిపారు. డాక్టర్లపై దాడులు జరుగుతున్న క్రమంలో..సెక్యూర్టీ ప్రాబ్లం ఉందని చెప్పామన్నారు. భద్రతా పరమైన భరోసాకు సంబంధించి జిల్లా కలెక్టర్ లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామని వారు చెప్పడం జరిగిందన్నారు. కరోనా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారన్నారు. టీడియస్ విషయంలో ఇతర రాష్ట్రాలలో పరిశీలించి నిర్ణయం చేస్తామన్నారని, ప్రభుత్వం తమ డిమాండ్ లపై సానుకూలంగా స్పందించడంతో 2021, జులై 10వ తేదీ గురువారం నుంచి యధావిధిగా విధులకు హాజరు అవుతామని జూనియర్ వైద్యులు వెల్లడించారు.

Read More : Mehul Choksi : చోక్సీ గర్ల్‌ ఫ్రెండ్‌ను కూడా మోసం చేశారా ?