Navaratnalu Money : జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రేపు వారి ఖాతాల్లోకి డబ్బులు

ఏపీ ప్రభుత్వం లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు వారి ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి. రేపు పలు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.

Navaratnalu Money : జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్, రేపు వారి ఖాతాల్లోకి డబ్బులు

Navaratnalu Money : ఏపీ ప్రభుత్వం లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపు వారి ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి. రేపు పలు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.

నవరత్నాల పథకాల కింద అర్హత ఉండి.. గతంలో వాటి లబ్ది పొందలేకపోయిన వీరి నుంచి ప్రభుత్వం ఇటీవల అప్లికేషన్లు స్వీకరించింది. 2.79 లక్షల మంది పథకాల లబ్ది పొందేందుకు అర్హులని ప్రభుత్వం గుర్తించింది. వివిధ పథకాలకు సంబంధించి వీరి ఖాతాల్లో రేపు రూ.590.91 కోట్లు జమ చేయనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నవరత్నాల పేరుతో జగన్ సర్కార్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాల కింద అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి ఆర్థిక సాయంగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేస్తోంది. అయితే కొంతమందికి అర్హత ఉన్నా డబ్బు పడలేదు. పలు కారణాలతో వారి అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారి అప్లికేషన్లను మరోసారి తనిఖీ చేసింది. అందులో అర్హులైన వారికి రేపు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.

ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత ఉన్నా చాలా మంది లబ్ధి పొందలేకపోయారు. అలాంటి వారికి మేలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉండీ పథకాలు పొందని లబ్ధిదారులను గుర్తించి, వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మంది లబ్దిదారులకు రూ. 590.91 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో.. అర్హులైన వారందరికీ మరో అవకాశం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల కింద నిధులు పంపిణీ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.

Also Read..CM Jagan Warning : ఆ 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్.. వారిలో మంత్రులు కూడా

పొరపాటున ఏ కారణంగా నైనా సంక్షేమ పథకాలు అందని వారు పథకం లబ్ధి అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, వాటిని వెరిఫై చేయించి అర్హులైన వారికి డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్‌ నెలలో, జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్‌ నెలలో ప్రతి ఒక్క అర్హుడికి అందజేస్తోంది ఏపీ సర్కార్. అంతేకాదు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు డిస్‌ప్లే చేయడం ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి, పారదర్శకతతో లంచాలు లేకుండా, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ పథకాల లబ్ధి అందిసోంది ప్రభుత్వం.

Also Read.. YS Jagan Birthday: ధైర్యం, పట్టుదలతో లక్ష్యానికి గురిపెట్టి.. ప్రజానేతగా ఎదిగిన జగన్..

వివిధ పథకాల క్రింద లబ్ధి పొందనున్న వారి వివరాలు..

1. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం- లబ్ధిదారుల సంఖ్య 863, రూ. 1.29 కోట్లు.

2. జగనన్న చేదోడు – లబ్దిదారుల సంఖ్య 725, రూ. 0.73 కోట్లు.

3. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా – లబ్ధిదారుల సంఖ్య 4,457, రూ. 4.46 కోట్లు.

4. జగనన్న విద్యాదీవెన – లబ్ధిదారుల సంఖ్య 1,22,833, రూ. 225.05 కోట్లు.5.

జగనన్న వసతి దీవెన – లబ్ధిదారుల సంఖ్య 18,697, రూ. 16.35 కోట్లు.

6. జగనన్న అమ్మ ఒడి – లబ్ధిదారుల సంఖ్య 43,710, రూ. 56.82 కోట్లు.

7. వైఎస్ఆర్ కాపు నేస్తం – లబ్ధిదారుల సంఖ్య 17,351, రూ. 26.03 కోట్లు.

8. వైఎస్ఆర్ వాహనమిత్ర – లబ్ధిదారుల సంఖ్య 9,005, రూ. 9.00 కోట్లు.

9. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల సంఖ్య 30,837, రూ. 57.82 కోట్లు.

10. వైఎస్ఆర్ నేతన్న నేస్తం – లబ్ధిదారుల సంఖ్య 2,577, రూ. 6.18 కోట్లు.

11. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా – లబ్ధిదారుల సంఖ్య 28,010, రూ. 187.18 కోట్లు.