Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 2వేల 190 పోస్టులు భర్తీ

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో 2వేల 190 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 2వేల 190 పోస్టులు భర్తీ

Jobs

Jobs : ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో 2వేల 190 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్‌లో 560 గ్రేడ్-2 ఫార్మసిస్ట్‌లతో పాటు వైద్య కళాశాలలో 1952 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 1285 ఉద్యోగాల అదనంగా మంజూరు చేసింది.

TDP : ఎన్టీఆర్ ఫ్యామిలీకి టీడీపీ పగ్గాలు అప్పగించడం మంచిది

2190 కొత్త పోస్టులు..
35 మెడికల్ కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులలో 2190 కొత్త పోస్టులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతోపాటు కొత్తగా సృష్టించిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేశారు.

కొత్తగా మంజూరైన పోస్టుల వివరాలు..
* ప్రొఫెసర్లు- 51
* అసోసియేట్ ప్రొఫెసర్లు-187
* అసిస్టెంట్ ప్రొఫెసర్లు- 130
* నర్సింగ్ -1040
* పారామెడికల్ -782

కొత్తగా మంజూరైన పోస్టులతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు పెరగనున్నాయి. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టింది.