Laptops : విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 6.53 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న..

Laptops : విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 6.53 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు

Laptops

Laptops : విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న విద్యార్థుల్లో కొందరు పథకాల డబ్బుకు బదులు ల్యాప్ టాప్ లను కావాలని ఆప్షన్ ఇచ్చారు.

ఇలా ఆప్షన్లు ఇచ్చిన 6.53 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు.. 6.53 లక్షల ల్యాప్ టాప్ లను కొనుగోలు చేసే బాధ్యతలను ఏపీటీఎస్ కు నోడల్ ఏజెన్సీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. లెనోవో, HP, DELL, ACER వంటి బ్రాండెడ్ ల్యాప్ టాప్ లను విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వనుంది.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

విద్యార్ధులకు డబ్బులకంటే ల్యాప్ టాప్ లు ఇస్తేనే మేలు జరుగుతుందని ప్రభుత్వం భావించింది. అయితే, కోరుకున్న వారికి మాత్రమే దీన్ని వర్తింపజేసింది. ప్రతీ ఏటా అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాల కింద అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం డబ్బు ఇస్తోంది. ఈ క్రమంలో డబ్బు వద్దనుకునే వారికి ల్యాప్ టాప్ లు పంపిణీ చేయబోతున్నారు.

Amma Odi : అమ్మఒడి డబ్బులు.. ప్రభుత్వం కొత్త రూల్

ఇకపోతే అమ్మఒడి పథకం కింద డబ్బులు రావాలంటే ప్రభుత్వం కొత్త షరతు పెట్టింది. అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి చేసింది. నవంబర్ 8, 2021 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరం ఉంటుంది. ఇందులో 75శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు అవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా కరోనా ఉంది కాబట్టే ఈ నిబంధన అమలు చేయలేదని, ఇక నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని వర్తింపజేసింది.