Jobs Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 3,393 పోస్టులు భర్తీ

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు ప్రభుత్వం రెడీ అయ్యింది. 3వేల 393 మిడ్‌-లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (MLHP) ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

10TV Telugu News

Jobs Notification : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు ప్రభుత్వం రెడీ అయ్యింది. 3వేల 393 మిడ్‌-లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (MLHP) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేయనుంది. వాస్తవానికి జూన్ లో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలను నవంబర్ నెలలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఉద్యోగాలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నుంచి అధికారికంగా అనుమతుల రాగానే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా..
శ్రీకాకుళం జిల్లాలో 209, విజయనగరం-176, విశాఖపట్నం-248, తూర్పుగోదావరి-440, పశ్చిమగోదావరి 295, కృష్ణా-268, గుంటూరు-310, ప్రకాశం-240, నెల్లూరు-236, చిత్తూరు-275, కడప-202, అనంతపురం-258, కర్నూలు జిల్లాలో 236 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే జోన్ల వారీగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. వీటితో పాటు మరో 54 స్పెషలిస్టు డాక్టర్లు, 683 మెడికల్ ఆఫీసర్లు, 1,062 స్టాఫ్ నర్సులు, 380 ల్యాబ్ టెక్నీషియన్లు, 384 పారామెడికల్, 42 ప్రోగ్రామ్ మేనేజ్ మెంట్ పోస్టులు ఉన్నాయి. ఎన్ హెచ్ ఎం కింద ఏపీలో ప్రస్తుతం 14వేల మంది పని చేస్తున్నారు.

అర్హత:
బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీని 6 నెలల కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌ కోర్సుతో పూర్తిచేసిన వారే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందకు అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో ఈ కోర్సు పూర్తిచేసిన వారు సుమారు 4,500 మంది అభ్యర్థులే ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఉద్యోగాలకు పోటీ తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 25 వేల వరకు జీతం చెల్లించనున్నారు. పనితీరును బట్టి నెలకు రూ. రూ.15వేల అదనపు ప్రోత్సాహకం ఇస్తారు.

10TV Telugu News