Seeds : రైతులకు శుభవార్త… 80శాతం రాయితీతో విత్తనాలు

భారీ వర్షాలతో రైతాంగం కుదేలైంది. కనీవిని ఎరుగుని వర్షాలు, వరదలతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కాస్త..

Seeds : రైతులకు శుభవార్త… 80శాతం రాయితీతో విత్తనాలు

Seeds

Seeds : భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్తంభించింది. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కొందరు అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా రైతాంగం కుదేలైంది. కనీవిని ఎరుగుని వర్షాలు, వరదలతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. 80 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తామంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు విత్తనాల తరలింపు ప్రారంభమైందని చెప్పింది.

శాసనసభలో వరద నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రకటన చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 34మంది మృతి చెందారని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటన చేశారు. భారీ వర్షాల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వరదలతో 5.33 లక్షల రైతులు నష్టపోయారని వెల్లడించారు.

Bike Start Problem : హలో భయ్యా.. మీ బైక్ స్టార్ట్ కావడం లేదా? ఈ ట్రిక్ ట్రై చేయండి!

”బాధితులకు తక్షణ సాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ల దగ్గర ప్రత్యేక నిధులు ఉంచాలని సీఎం ఆదేశించారు. దీంతో కడప, చిత్తూరు, నెల్లూరు కలెక్టర్ల దగ్గర రూ.10 కోట్లు, అనంతపురం జిల్లా కలెక్టర్‌ దగ్గర రూ.5 కోట్లు సిద్ధంగా ఉంచాం” అని మంత్రి తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల ద్వారా బాధితులకు సాయం అందించామని.. వరదల కారణంగా పునరావాస క్యాంపుల్లోని వారికి రూ.2 వేలు ఆర్ధిక సాయం చేస్తామన్నారు. వ్యవసాయ పంటలు 2.63 హెక్టార్లు, 24 వేల ఉద్యాన పంటలు నీట మునిగిపోయాయని… ప్రాథమికంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిలినట్టు తేలిందని ప్రకటించారు. వరద ప్రభావం తగ్గాక పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ పూర్తి స్థాయిలో చేపడతామని మంత్రి కన్నబాబు చెప్పారు.

పాడి పశువులు నష్టపోతే ఒక్కో దానికి రూ.30 వేల చొప్పున ఆయా బాధిత కుటుంబాలకు ఇస్తామన్నారు మంత్రి. గొర్రెలు, మేకలను నష్టపోతే రూ.3 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. పాడి పశువుల కోసం పశుగ్రాసం, దాణా సరఫరా చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారని మంత్రి కన్నబాబు తెలిపారు.

Richest Youtubers : డబ్బే డబ్బు.. యూట్యూబ్ ద్వారా కోట్ల సంపాదన.. ఇండియా రిచెస్ట్ యూట్యూబర్స్..

మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించి ముగ్గురు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది మరణించారని.. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

వరద బాధితుల పట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలని పిలుపునిచ్చిన సీఎం జగన్, వరద బాధితులను అదుకునేలా కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్షికంగా ఇళ్లు దెబ్బతింటే రూ.5,200, పూర్తిగా దెబ్బతింటే రూ.95 వేలు అందజేయాలన్నారు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైతే కొత్తగా మంజూరు చేయాలన్నారు.