ప్రయాణికుల కోసం ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ 8309887955 : చార్జీలు పెంచితే ఫిర్యాదు చేయండి

ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో

  • Published By: veegamteam ,Published On : January 17, 2020 / 11:15 AM IST
ప్రయాణికుల కోసం ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ 8309887955 : చార్జీలు పెంచితే ఫిర్యాదు చేయండి

ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో

ఏపీ ప్రభుత్వం ప్రయాణికుల కోసం వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. సంక్రాంతి పండక్కి గ్రామాలకు వెళ్లిన వారు.. రిటర్న్ జర్నీలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాట్సాప్ నెంబర్ 8309887955 అనౌన్స్ చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు చార్జీలు ఎక్కువ వసూలు చేసినా, బస్సులో పరిశుభ్రత లేకపోయినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఏపీ రవాణశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. శుక్రవారం(జనవరి 17,2020) మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్నినాని.. ప్రైవేట్ ట్రావెల్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అధిక టికెట్ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

perni nani

 

ఒక్కరూపాయి ఎక్కువ తీసుకున్నా తాట తీస్తా:

ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు మంత్రి పేర్నినాని. ప్రైవేట్ ట్రావెల్స్ ను కట్టడి చేసేందుకు వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చామని చెప్పారు. సాధారణ రోజుల్లో టికెట్ ధర ఎంత ఉంటుందో అంతే తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ బస్సుల్లో ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తప్పవన్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. పండగ పేరుతో దోపిడీ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేస్తామన్నారు.

జగన్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. సంక్రాంతి ప్రయాణికుల తిరుగుపయనం కోసం ఆర్టీసీలో అనేక బస్సులు ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. దయచేసి ప్రయాణికులంతా సురక్షితమైన, సుఖమయమైన జర్నీ కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని మంత్రి కోరారు. డిమాండ్ కు సరిపడ బస్సులు ఏర్పాటు చేశామన్నారు.

తిరుగు ప్రయాణం కోసం 3వేల స్పెషల్ బస్సులు:
సంక్రాంతి పండగ సందర్భంగా నిబంధనలను పాటించని 500 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశామని మంత్రి తెలిపారు. పండగ సందర్భంగా గ్రామాలకు వచ్చిన ప్రయాణికులను దోపిడీ చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సంక్రాంతి పండగ కోసం 4వేల 200 స్పెషల్ బస్సులు నడపాలని అనుకున్నా.. 2వేల 945 బస్సులను మాత్రమే తిప్పామని చెప్పారు. వాటి ద్వారా 2 లక్షల 10 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. రెగులర్ బస్సుల్లో లక్షా 3 వేల 500 మంది జర్నీ చేశారని మంత్రి తెలిపారు. గతేడాదితో పోలిస్తే రెగులర్ బస్సుల్లో 7 వేల మందిని ఎక్కువగా తీసుకొచ్చామన్నారు. స్పెషల్ బస్సుల ద్వారా 20 వేల మందికిపైగా ప్రయాణికులను తరలించామని చెప్పారు. తిరుగు ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం 3 వేల స్పెషల్ బస్సులను సిద్ధంగా ఉంచామన్నారు.

కృష్ణా జిల్లాలో 202 బస్సులు సీజ్: 
సంక్రాంతి పండగ సందర్భంగా రవాణ సమస్యలపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. జనవరి 2 నుంచి 16వ తేదీ వరకు నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై 3వేల 132 కేసులు నమోదు చేశామన్నారు. ఏపీ వ్యాప్తంగా 546 బస్సులు సీజ్ చేశామన్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 202 బస్సులు, విశాఖ జిల్లాలో 198 బస్సులు సీజ్ చేశామన్నారు. కేసు నమోదు విషయంలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. కృష్ణా జిల్లాలో 645 బస్సులపై కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 367 బస్సులపై కేసులు నమోదయ్యాయని వివరించారు.