నిరుద్యోగులకు శుభవార్త : ఏపీ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 09:55 AM IST
నిరుద్యోగులకు శుభవార్త : ఏపీ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది సీఎం జగన్ ప్రభుత్వం. 16 వేలకు పైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం(జనవరి 10,2020) నోటిఫికేషన్ విడుదల చేశారు.

విభాగాల వారీగా గ్రామ సచివాలయ 14 వేల 061, వార్డు సచివాలయం 2 వేల 146 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

గత సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన ఉద్యోగాలతో పాటు, వివిధ రకాల పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ తెలిపింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలు మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.

విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి : –
గ్రామ సచివాలయ ఖాళీలు :-
పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ -5) – 61
వీఆర్వో (గ్రేడ్ 2) – 246
ఏఎన్ఎం(గ్రేడ్ 3) – 648
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 69

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1782
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(గ్రేడ్ 2) – 536
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 43
విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ – 762
ఇంజనీరింగ్ అసిస్టెంట్ – 570
 

డిజిటల్ అసిస్టెంట్ – 1134
విలేజ్ సర్వేయర్(గ్రేడ్ 3) – 1255
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ – 97
వెటర్నరీ అసిస్టెంట్ – 6,858

వార్డు సచివాలయ ఖాళీలు :
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 105
వార్డు అమినిటీస్(వసతుల) సెక్రటరీ – 371
వార్డు శానిటేషన్, ఎన్విరాన్ మెంట్ సెక్రటరీ – 513
వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 100
వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ – 844
వార్డు వెల్ఫేర్, డెవలప్ మెంట్ సెక్రటరీ – 213

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 11, 2020.
దరఖాస్తు చివరి తేది : జనవరి 31, 2020.