విశాఖ గ్యాస్‌లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు నోటీసులు  

  • Published By: srihari ,Published On : May 7, 2020 / 12:38 PM IST
విశాఖ గ్యాస్‌లీక్ ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు నోటీసులు  

విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.  మానవ తప్పిదమా? అధికారుల నిర్లక్ష్యమా? స్ధానికంగా పని చేస్తున్న వారి నిర్లక్ష్యమా?  అన్న సందేహాలు కల్గుతున్నాయి. కొన్ని గంటల్లో పరిస్థితి అంతా అదుపు తప్పి పోయింది.

ప్రకృతి, చెట్టు చేము, మూగజీవాలు, మనుషులు  విగతజీవులుగా పడి ఉన్న దృశ్యాలు అందరినీ తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. ఈ ఘటన పట్ల విశాఖ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే పది మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. వందలాది అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

అసలు  జనావాస ప్రాంతంలో విష వాయువులు వెలువడే అవకాశమున్న పరిశ్రమను ఎలా స్థాపించారని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజులపాటు విచారణ వాయిదా వేసింది. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలు మళ్లీ ప్రారంభించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సివుంది. మిషనరీస్ అన్ని కూడా స్టక్ అయిపోయాయి. ఆ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. అధికార యంత్రాంగం ముందుగా వారిని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది.

సంబంధిత శాఖకు సూచనలు ఇవ్వాల్సివుంటుంది. స్కిల్డ్ లేబర్స్ ను అక్కడ ఉంచి, ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయన్న అంశానికి సంబంధించి వారికి తగు జాగ్రత్తలు చెప్పాల్సివుంటుంది. ఎవరివారు ఒంటిరిగా వెళ్లి పరిశ్రమలను ప్రారంభించడం జరిగింది. కాబట్టి దుర్ఘటన జరిగినట్లు ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈమేరకు అధికారులు ప్రభుత్వానికి సమాచారం అందించారు. జనవాసాల్లో పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చిన శాఖలు కోర్టుకు రావాల్సివుంటుంది.