AP High Court : కోనసీమ అల్లర్ల పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రూ.50లక్షలు ఫైన్ వేస్తామని వార్నింగ్

ఇలాంటి పిటిషన్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయంది. అంతేకాదు.. రూ.50లక్షల జరిమానా విధిస్తామని పిటిషనర్ ను హెచ్చరించింది.

AP High Court : కోనసీమ అల్లర్ల పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రూ.50లక్షలు ఫైన్ వేస్తామని వార్నింగ్

Ap High Court

AP High Court : కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లా పేరు మార్పునకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీసిన తెలిసిందే. విధ్వంసాలు, దహనాలు చోటు చేసుకున్నాయి.

AP Cabinet Decisions : కోనసీమ జిల్లా పేరు మార్పు, 27న ఖాతాల్లోకి డబ్బులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

కాగా, కోనసీమలో చోటు చేసుకున్న అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు పిటిషనర్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటాయని తెలిపింది. అంతేకాదు..రూ.50లక్షల జరిమానా విధిస్తామని పిటిషనర్ ను హెచ్చరించింది కోర్టు. దీంతో పిటిషనర్ న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంతరం దాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చింది. దీనిపై కోనసీమలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా ప్రభుత్వం లెక్క చేయకపోవడంతో అది కాస్తా హింసకు దారితీసింది.

ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పుపెట్టారు. బస్సులను కూడా దగ్ధం చేశారు ఆందోళనకారులు. అల్లర్లలో పాల్గొన్న 258 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటివరకు 217 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నారు. మిగతా వారిని పట్టుకోవడానికి 7 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కోనసీమ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు ఏడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు పోలీసులు.

Meruga Nagarjuna : అంబేద్కర్.. ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు- మంత్రి నాగార్జున

ఇది ఇలా ఉంటే.. కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. జిల్లా పేరు మార్పునకే ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నారు. అమ‌లాపురం కేంద్రంగా కొత్త‌గా ఏర్పాటైన కోన‌సీమ జిల్లా పేరును ఇక‌పై అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా ప‌రిగ‌ణిస్తారు.